UnStoppable4 : బాలయ్య అన్ స్టాపబుల్ అంతే.. హీరో సూర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

2 Min Read

UnStoppable4 : బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 4 కార్యక్రమం నేడు ప్రారంభం కాబోతుంది. ఇక మొదటి ఎపిసోడ్ గెస్ట్ గా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరు కాబోతున్నారు. ఇప్పటికే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల కాగా ఈ ప్రోమో ఎపిసోడ్ పై భారీ స్థాయిలో అంచనాలను పెంచేసింది. ఇక నేడు ఈ ఎపిసోడ్ ప్రసారం కానున్న నేపథ్యంలో ఎంతో ఆసక్తి నెలకొంది.

ఇక ఈ కార్యక్రమానికి సినిమా సెలబ్రిటీలు కూడా హాజరు కాబోతున్నారు. ఇప్పటికే పలువురు హీరోలు ఈ కార్యక్రమంలో పాల్గొని షూటింగ్ కూడా పూర్తి చేసుకున్నారని తెలుస్తోంది. ఇక సీజన్ ఫోర్ కార్యక్రమంలో భాగంగా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కూడా పాల్గొన్నారని తెలుస్తుంది. సూర్య నటించిన కంగువ సినిమా నవంబర్ 14వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లలో భాగంగా సూర్య కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Also Read : Samantha: సమంత పై మంత్రికి సంచలన వ్యాఖ్యలు.. ఏకమైన టాలీవుడ్!

UnStoppable4

ఇప్పటికే సూర్యకు సంబంధించిన ఎపిసోడ్ కూడా షూటింగ్ పూర్తి అయిందని తెలుస్తుంది. ఇక ఈ షూటింగ్ తర్వాత ఈయన హైదరాబాద్లోనే ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ గురించి సూర్య ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తాను గతంలో బాలకృష్ణ గారిని కలిసినప్పుడు ఎప్పుడు ఆయనతో ఎక్కువగా మాట్లాడలేదు. కానీ మొదటిసారి బాలకృష్ణ గారితో కలిసి చాలాసేపు మాట్లాడానని తెలిపారు.

బాలకృష్ణ గారు నిజంగానే అన్ స్టాపబుల్(UnStoppable4) ఈ కార్యక్రమంలో కంగువ సినిమాకు సంబంధించి ఎన్నో విషయాలను మాట్లాడుకున్నామని తెలిపారు. ముఖ్యంగా బాలకృష్ణ గారి సమయపాలన చూసి తాను ఎంతో ఆశ్చర్యపోయానని తెలిపారు. పని విషయంలో ఆయన చాలా అంకితభావంతో ఉంటారు ప్రతిరోజు పొద్దున్నే 3.30 గంటలకే నిద్ర లేచిన ఆయనలో ఏమాత్రం అలసట కనిపించదని ఉదయం ఎలా ఉంటారో సాయంత్రం వరకు అదే చలాకితనంతో ఉంటారంటూ బాలకృష్ణపై సూర్య ప్రశంశల వర్షం కురిపించారు. ఇలా బాలయ్య గురించి సూర్య చేసిన ఈ కామెంట్స్ నందమూరి అభిమానులను సంతోష పెడుతున్నాయి.

Share This Article
Exit mobile version