ChandraBabu: లోకేష్ కోసమే ఎన్టీఆర్ ను దూరం పెట్టారా… బాలయ్య ప్రశ్నకు బాబు సమాధానం ఏంటి?

2 Min Read

ChandraBabu : నందమూరి బాలకృష్ణ హోస్టుగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్యఅతిథిగా హాజరు కాబోతున్నారు. ఫస్ట్ ఎపిసోడ్ వీరిదే ప్రసారం కానుంది ఈ కార్యక్రమం అక్టోబర్ 25 రాత్రి 8:30కు ప్రసారం కాబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఇందులో పవన్ కళ్యాణ్ తో జైలులో జరిగిన చర్చల గురించి అలాగే తన జైలు జీవితం గురించి చంద్రబాబునాయుడు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఇకపోతే ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గురించి అలాగే జగన్ గురించి కూడా చంద్రబాబు నాయుడు(ChandraBabu) ప్రస్తావనకు తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ఇక బాలకృష్ణ తన బావను సూటిగా ఒకే ఒక ప్రశ్న వేశారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తెలుగుదేశం పార్టీ పగ్గాలు నిజానికి నందమూరి వారసులకే చెందాలి కానీ ఈ పార్టీ పగ్గాలు ఎలాంటి పరిస్థితులలో చంద్రబాబు నాయుడు చేతులలోకి వెళ్లాయో మనకు తెలిసిందే. ఎప్పటికైనా ఈ పార్టీ పగ్గాలు నందమూరి వారసులకే వెళ్తాయని పలువురు భావిస్తున్నారు.

Also Read : CM Chandrababu :తిరుపతి లడ్డూలలో జంతువుల కొవ్వు.. సీఎం చంద్రబాబు సంచలన ఆరోపణలు

chandrababu

ఇకపోతే తెలుగుదేశం పార్టీ తదుపరి వారసుడిగా చంద్రబాబు నాయుడు ఎప్పుడో లోకేష్ ప్రకటించారని మరికొందరు భావిస్తున్నారు. అయితే తన కుమారుడు లోకేష్ కోసమే ఎన్టీఆర్ ను దూరం పెడుతూ వస్తున్నారనే వాదన కూడా ఉంది. ఈ విషయం గురించే సూటిగా బాలయ్య లోకేష్ కోసమే ఎన్టీఆర్ ని దూరం పెడుతున్నారా అంటూ ప్రశ్నించినట్లు సమాచారం. మరి బావ బాలకృష్ణ అడిగిన సూటి ప్రశ్నకు బాబు సమాధానం ఏంటి.. ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఆయన ఎలాంటి సమాధానం చెప్పారనే విషయంపై ఆసక్తి నెలకొంది. మరి ఈ కార్యక్రమంలో బాలకృష్ణ అలాగే చంద్రబాబు నాయుడు మధ్య ఇంకా ఎలాంటి విషయాలు చర్చలకు వచ్చాయనేది తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఎదురు చూడాల్సిందే.

ఇక ఈ కార్యక్రమానికి రాజకీయ నాయకులతో పాటు పలువురు సినిమా సెలబ్రిటీలు కూడా హాజరు కాబోతున్నారు.ఇప్పటికే పలు ఎపిసోడ్స్ షూటింగ్ కూడా పూర్తి అయ్యాయని తెలుస్తోంది. ఇక గతంలో తన కొడుకుతో కలిసి ప్రతిపక్ష నేతగా ఈ కార్యక్రమానికి వచ్చిన చంద్రబాబు నాయుడు ఈసారి సీఎం హోదాలో అన్ స్టాపబుల్ కార్యక్రమానికి హాజరయ్యారు.

Share This Article
Exit mobile version