Balakrishna : బాలకృష్ణకు బంపర్ ఆఫర్ ఇచ్చిన రేవంత్ రెడ్డి.. ఆ బిజినెస్ రంగంలోకి బాలయ్య?

2 Min Read

Balakrishna : సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రిటీలు ఒకవైపు సినిమా రంగంలో కొనసాగుతూనే మరోవైపు పలు వ్యాపార రంగాలలో కూడా దూసుకుపోతున్నారు. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలకు సొంతంగా థియేటర్లు, స్టూడియోలు కూడా ఉన్న విషయం మనకు తెలిసిందే.

అయితే గత రెండు సంవత్సరాల క్రితం అల్లు అరవింద్ కూడా సొంతంగా ఒక స్టూడియో ఏర్పాటు చేశారు. ఇక ఇండస్ట్రీలో ఉన్నటువంటి రామానాయుడు స్టూడియో రామకృష్ణ స్టూడియో అక్కినేని స్టూడియో ఇలా ఎన్నో స్టూడియోలు ఉన్నాయి. వీటన్నిటికీ అప్పటి ప్రభుత్వాలు భూములను ఇచ్చి ఎంతో సహకరించాయి.

Also Read : Balakrishna: నందమూరి వారసులు వాళ్లేనా… ఎన్టీఆర్ వారసుడు కాదా.. బాలయ్య షాకింగ్ కామెంట్స్?

ఇకపోతే తాజాగా నందమూరి బాలకృష్ణ(Balakrishna) కూడా గత ఐదు సంవత్సరాల కాలంలో స్టూడియో నిర్మాణం చేపట్టాలని భావించారు. కానీ అప్పటి ఏపీ ప్రభుత్వం సహకరించకపోవడంతో ఈయన వెనుకడుగు వేశారు. ప్రస్తుతం మాత్రం తెలంగాణలో ఈయన స్టూడియో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా ఉన్నారని తెలుస్తోంది.

ఇటీవల రేవంత్ రెడ్డిని కలిసిన బాలకృష్ణ ఆయన ఏకంగా 500 ఎకరాల ప్రభుత్వ భూమిని స్టూడియో నిర్మాణానికి ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నట్లు వార్తల వినపడుతున్నాయి. ఇప్పటికే ఈ భూమికి కేటాయింపుల ప్రతిపాదనకు రెవెన్యూ శాఖ ఆమోదముద్ర వేసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి పంపినట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంలో ఎంతవరకు నిజం ఉంది ఏంటి అనే విషయాలు తెలియాల్సి ఉంది.

ఇకపోతే బాలకృష్ణ ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా హీరోగా ఎంతో బిజీగా ఉండగా మరోవైపు ఎమ్మెల్యేగా కూడా ఈయన రాజకీయాలలో బిజీగా ఉంటున్నారు. ప్రస్తుతం ఈయన బాబి డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఆఖండ సీక్వెల్ చిత్రం కూడా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇకపోతే రాజకీయాలలో కూడా ఎంతో చలాకీగా ఉన్నటువంటి బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గం నుంచి ముచ్చటగా మూడుసార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచి రాజకీయాలలో కూడా తను స్టామినా ఏంటో నిరూపించుకున్నారు.

Share This Article
Exit mobile version