Balakrishna: నందమూరి బాలకృష్ణ గత కొంతకాలంగా నందమూరి వారసులైనటువంటి ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ను పూర్తిగా దూరం పెడుతూ ఉన్నారని చెప్పాలి. ఎప్పుడైతే హరికృష్ణ మరణించారో అప్పటినుంచి వీరిద్దరిని నందమూరి కుటుంబం దూరం పెడుతూ వస్తున్నారు. నందమూరి కుటుంబంలో ఏ విధమైనటువంటి శుభకార్యాలు జరిగినా కూడా పెద్దగా వీరికి ఆహ్వానం లభించడం లేదు. ఈ విషయంలో బాలకృష్ణ వ్యవహార శైలి ఎన్టీఆర్ అభిమానులకు ఏమాత్రం నచ్చడం లేదు.
ఇలా బాలకృష్ణ తమని దూరం పెడుతున్న ఎన్టీఆర్ మాత్రం బాలకృష్ణ అంటే ఎంతో గౌరవం ఇస్తూ వస్తున్నారు. ఇటీవల బాలయ్య కొడుకు మోక్షజ్ఞ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల కాగా ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఇద్దరు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తమ తమ్ముడికి అభినందనలు తెలియజేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా బాలయ్య చేసిన వ్యాఖ్యలు ఎన్టీఆర్ అభిమానులకు మరింత కోపాన్ని తెప్పిస్తున్నాయి.
Also Read :Janhvi Kapoor : ఏంటి జాన్వీ అసలు ఊహించలేదు.. దేవరకి నీ రెమ్యూనరేషన్ అంత తక్కువా ?
Balakrishna’s Shocking Comments: Who Are the Real Nandamuri Heirs? Is NTR Not One?
ఇటీవల ఐఫా అవార్డు వేడుకలు అబుదాబిలో ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ గోల్డెన్ లెగసి అవార్డును అందుకున్నారు. ఇక ఈ అవార్డును అందుకున్న బాలయ్య ఇది తన తండ్రి నందమూరి తారక రామారావుకి అంకితం ఇచ్చారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా బాలయ్యకు విలేకరుల నుంచి ఒక ప్రశ్న ఎదురయింది. నందమూరి తారక రామారావు వారసుడు బాలకృష్ణ.. మరి బాలకృష్ణ వారసులు ఎవరు అనే ప్రశ్న ఎదురయింది.
ఈ ప్రశ్నకు బాలకృష్ణ సమాధానం చెబుతూ కచ్చితంగా నా వారసులు నా కొడుకు మోక్షజ్ఞ, నా మనవళ్లు అంటూ ఈయన సమాధానం చెప్పారు. బాలకృష్ణ చెప్పిన సమాధానం నిజమే అయినప్పటికీ ఎన్టీఆర్ కూడా నందమూరి వారసుడే. ఎన్టీఆర్ ని కూడా తన కొడుకుగా భావించి తన వారసులు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ పేర్లు కూడా చెప్పి ఉంటే బాగుండేది అంటూ ఎన్టీఆర్ అభిమానులు బాలయ్య వ్యవహార శైలి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా బాలకృష్ణ తమని ఎప్పటికప్పుడు దూరం పెడుతూ వస్తున్నా ఎన్టీఆర్ మాత్రం తన బాబాయ్ అంటే అదే గౌరవం వినయ విధేయతలను చూపిస్తున్నారని చెప్పాలి.