Balakrishna: నాకు నా భార్యకు గొడవలు పెట్టాలని చూస్తున్నారు

2 Min Read

Balakrishna: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నందమూరి నట సింహం బాలకృష్ణ ఒకరు. ఎన్టీఆర్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఎంతో మంచి సక్సెస్ అందుకున్న బాలకృష్ణ ప్రస్తుతం యువ హీరోలకు కూడా పోటీ ఇస్తూ వరుస సినిమాలలో నటించడమే కాకుండా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయాలను అందుకుంటున్నారు.

ఇలా ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు రాజకీయాలలో కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకుంటున్నారు. ఇప్పటికే బాలకృష్ణ(Balakrishna) హిందూపురం నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయం సాధించారు. ఇలా ఎమ్మెల్యేగా కూడా నియోజకవర్గ అభివృద్ధి పై దృష్టి సారిస్తూ అక్కడ ప్రజల మన్నన పొందారు. ఒకప్పుడు కేవలం ఇండస్ట్రీపై మాత్రమే దృష్టి పెట్టిన బాలయ్య ఇప్పుడు మాత్రం పలు బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్నారు.
ఇక షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కూడా ఈయన పాల్గొంటున్నారు.

Also Read:Suzuki New Bikes: దీపావళికి మార్కెట్లోకి కొత్త మోడల్స్ ను దింపుతున్న సుజుకీ

ఇలా వృత్తిపరమైన జీవితంలో మాత్రమే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా ఈయన చాలా సంతోషంగా గడుపుతున్నారు. తన ముగ్గురు పిల్లలు ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఇక బాలకృష్ణ షూటింగ్ పనులలో బిజీగా ఉంటే తన భార్య వసుంధర తన పిల్లల బాధ్యతలను కుటుంబ బాధ్యతలను ఎంతో చక్కగా నిర్వర్తిస్తున్నారు. అయితే తాజాగా తన భార్యకు తనకు మధ్య గొడవ పెట్టాలని చూస్తున్నారు అంటూ బాలకృష్ణ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

బాలకృష్ణ ఇటీవల షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో పాల్గొన్నారు. ఇక ఈ షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో హీరోయిన్ మీనాక్షి చౌదరి కూడా వచ్చింది. అయితే షాపింగ్ మాల్ ఓపెనింగ్ తర్వాత ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో భాగంగా మీడియా వారు బాలయ్యను ప్రశ్నిస్తూ మీరు ఎప్పుడైనా మీ భార్య వసుంధర గారికి చీర అయినా కొని పెట్టారా అంటూ ప్రశ్న అడగడంతో కాస్త సీరియస్ అయినా బాలకృష్ణ ఇప్పుడు అవన్నీ అవసరమా.. అనవసరంగా మా కాపురంలో చిచ్చు పెడతారు అంటూ నవ్వేశారు. దీంతో అక్కడున్న వారందరూ కూడా బాలయ్య మాటలకు నవ్వుకున్నారు.

Share This Article