Balagam Venu : గతేడాది తెలుగులో బలగం అనే సినిమా వచ్చింది. చిన్న సినిమాగా విడుదలై అంతర్జాతీయ స్థాయిలో అవార్డ్‌లు, రివార్డులు సాధించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ సినిమాకి ముందు వేణు ఎల్దండి అంటే పెద్దగా ఎవరికీ తెలియదు. ఆయనను జబర్ధస్త్ ఫేమ్ వేణు అంటారు. ఇప్పుడు ఆయనను బలగం వేణు అని అంటున్నారు. తెలంగాణలోని పల్లెటూళ్లలో జరిగిన చావు, ఆ తర్వాత జరిగే సంఘటనలను ఆయన ఈ చిత్రంలో చాలా ఎమోషనల్‌గా చూపించారు. అందుకే ప్రతి గ్రామంలో ప్రొజెక్టర్లు ఏర్పాటు చేసి మరీ ఈ సినిమాను ప్రదర్శించారు. దిల్ రాజు నిర్మాణంలో వేణు ఎల్దండి చేయబోయే మరో కొత్త ప్రాజెక్ట్ ఎల్లమ్మ అనే విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా చాలా రోజులు నుంచి పలువురు హీరోల చేతులు మారుతోంది.
ఎల్లమ్మ ప్రాజెక్ట్ మొదటగా నానికి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే అది రెమ్యునరేషన్ సమస్య, లేక స్క్రిప్ట్‌లో మార్పులు చేర్పులు చేయాలనుకున్నాడా.. లేక మరేదైనా కారణమా అనేది తెలియదు, కానీ అతను ఆ ప్రాజెక్టును వదులుకున్నాడు. ఆ తర్వాత శర్వానంద్‌కి వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ కూడా నటిస్తాడని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ఎట్టకేలకు ఈ ప్రాజెక్ట్ తేజ సజ్జా వద్దకు వెళ్లింది. వేణు కూడా తేజ సజ్జాని దృష్టిలో పెట్టుకుని ఈ స్క్రిప్ట్‌ని డెవలప్ చేస్తున్నాడని తెలిసింది. అయితే ఈ సినిమా కథ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు లీక్ అయ్యాయి.
ఎల్లమ్మ స్క్రిప్ట్‌ను తేజ సజ్జా ఓకే చేశారట. కొమురవెల్లి మల్లన్న దేవుడు కథ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. బలగం మాదిరిగానే ఎల్లమ్మ ప్రాజెక్టు కూడా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పే విధంగా ఉంటుంది. వేణు ఎల్లమ్మ చిత్రాన్ని డివోషనల్ టచ్‌తో భారీ ఫాంటసీ యాక్షన్ డ్రామాగా.. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఈ సినిమాలో చివరి 30 నిమిషాల్లో వీరోచితమైన యాక్షన్ ఎపిసోడ్ ఉండబోతుందట. అంతేకాదు క్లైమాక్స్‌లో హీరో కొమురవెల్లి మల్లన్న గెటప్‌లో కనిపిస్తాడని, ఫైట్ ఆ గెటప్‌లో ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఈ నెలలోనే ప్రాజెక్ట్‌ని ప్రారంభించి అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్నట్లు సమాచారం. ఇక ఎల్లమ్మ కథ విషయంలో వస్తున్న వార్తల్లో ఎంత నిజముందో తెలీదు కానీ, నిజమైతే మాత్రం టాలీవుడ్ లో ఫాంటసీ జానర్లో మరో భారీ బ్లాక్ బస్టర్ వచ్చినట్టే అని నెట్టింట కామెంట్స్ వస్తున్నాయి.