Bala krishna : బాలయ్య 109 సినిమా బిగ్ అప్డేట్.. టైటిల్, టీజర్ వచ్చేది అప్పుడే!

2 Min Read

Bala krishna : నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇటీవల కాలంలో బాలకృష్ణ నటిస్తున్న సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇటీవల అనిల్ రావిపూడి డైరెక్షన్లో వచ్చిన భగవంత్ కేసరి సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ బాబి డైరెక్షన్లో మరో సినిమాకు కమిట్ అయ్యారు.

ఈ సినిమా కూడా హై వోల్టేజ్ యాక్షన్ మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు ఇప్పటివరకు ఎలాంటి టైటిల్ ప్రకటించలేదు. ప్రస్తుతం ఈ సినిమా NBK 109 అనే వర్కింగ్ టైటిల్ తోనే ఈ సినిమా షూటింగ్ పనులు జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాకి వీరమాస్ అనే టైటిల్ పెట్టబోతున్నారని ప్రచారంలో ఉంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక బిగ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read :ప్రారంభానికి సిద్ధంగా మొదటి ఫీచర్స్ తెలిస్తే Vande Bharath Metro అవాక్కవ్వాల్సిందే

Bala Krishna New Movie Updates

ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ తో పాటు ఈ సినిమా టీజర్ విడుదల గురించి త్వరలోనే విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది. అయితే త్వరలోనే బాలకృష్ణ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలోనే సెప్టెంబర్ ఒకటవ తేదీ ఈయన స్వర్ణోత్సవ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో ఎంతోమంది అభిమానులు సినీ సెలబ్రిటీలు కూడా భాగం కాబోతున్నారు.

ఇక ఈ వేదికపైనే బాలకృష్ణ కొత్త సినిమాకు సంబంధించిన టైటిల్ తో పాటు టీజర్ కూడా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇలా ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అప్డేట్ త్వరలోనే రాబోతుందనే విషయం తెలిసిన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ,ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

Share This Article
Exit mobile version