KTR: రైతులంటే ఉగ్రవాదులు అనుకున్నారా.. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం

KTR: బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తరచూ తెలంగాణ సర్కారు పట్ల మండిపడటమే కాకుండా ప్రభుత్వ విధివిధానాలపై ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఇక ఇటీవల వికారాబాద్ జిల్లా లగచర్ల గ్రామంలో చోటు చేసుకున్న ఘటనపై కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వికారాబాద్ జిల్లా లగచర్ల గ్రామంలో ఫార్మ కంపెనీ భూ సేకరణ కోసం జిల్లా కలెక్టర్ తో పాటు ఎమ్మార్వోలు ఇతర ప్రభుత్వ అధికారులు వెళ్లిన విషయం తెలిసిందే.

ఈ గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో గ్రామసభ ఏర్పాటు చేయడంతో గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో అధికారులు గ్రామంలోకి వెళ్లగా అక్కడ గ్రామస్తులు ఒక్కసారిగా అధికారులపై దాడి చేశారు. ఓ మహిళ ఏకంగా వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పట్ల చెయ్యి చేసుకున్నారు. దీంతో ఈ విషయం కాస్త సంచలనంగా మారింది.

Also Read : KTR: సమంత నాగచైతన్య విడాకులకు కేటీఆర్ కారణం.. మంత్రి సురేఖ హాట్ కామెంట్స్!

KTR

ఇలా భూసేకరణ కోసం వెళ్ళిన అధికారులపై గ్రామస్తులు దాడి చేయడంతో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించార. అలాగే చుట్టుపక్కల గ్రామాలకు ఇంటర్నెట్ సేవలు కూడా నిలిపివేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువస్తున్నారు. ఇక అర్ధరాత్రి సమయంలో పోలీసులు 28 మంది గ్రామస్తులను అరెస్టు చేశారు. ఈ విషయంపై కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ మండిపడ్డారు.

లగచర్ల గ్రామంలో అర్ధరాత్రి 300 మంది పోలీసులను పంపించి 28 మంది రైతులను అరెస్టు చేయించారు. వారిని రైతులు అనుకున్నారా లేక ఉగ్రవాదులు అనుకుంటున్నారా. ఫార్మా కంపెనీ భూ సేకరణ కోసం పచ్చని పంటలు పండే పొలాలను వల్లకాడు చేయొద్దన్నందుకు అరెస్టులా? ఇదేనా వెలుగులను తరిమి చీకట్లను నింపే ఇందిరమ్మ రాజ్యం అంటే అంటూ X వేదికగా ఈయన తెలంగాణ సర్కార్ వ్యవహార శైలి పై మండిపడుతూ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

వికారాబాద్ జిల్లాలో ఈ ఘటన నిన్న మధ్యాహ్నం జరిగినది. అప్పటినుంచి ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే పోలీసులు భారీ స్థాయిలో మోహరించి ముందస్తు భద్రత చర్యలను చేపట్టారు. ప్రస్తుతం లగచర్ల గ్రామంలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.

Share This Article
Exit mobile version