Anushka: ఆ మ్యూజిక్ డైరెక్టర్ కు ప్రతి ఏటా ఐఫోన్ గిఫ్ట్ పంపుతున్న అనుష్క.. ఏం జరుగుతుందసలు?

2 Min Read

Anushka: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటి అనుష్క ఒకరు. ఈమె సౌత్ సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా ఓ వెలుగు వెలిగారు.. సూపర్ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన అనుష్క అతి తక్కువ సమయంలోనే స్టార్ట్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారు. ఈమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఎన్నో ప్రయోగాత్మక సినిమాలలో కూడా నటించి గుర్తింపు పొందారు.

అనుష్క నటించిన అరుంధతి సినిమా తన కెరీర్ ను కీలక మలుపు తిప్పింది. ఈ సినిమా తర్వాత ఈమెకు తెలుగుతో పాటు తమిళంలో కూడా సినిమా అవకాశాలు వచ్చాయి. ఇక బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ఈమె అధిక శరీర బరువు ఉండటంతో కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం పలు భాషలలో సినిమాలు చేస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.

ఇదిలా ఉండగా తాజాగా అనుష్కకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అనుష్కకు ఇండస్ట్రీలో ఎంతోమంది సెలబ్రిటీలతో చాలా మంచి సాన్నిహిత్యం ఉంది. ఇక ఈమె మంచితనం గురించి ఎంతోమంది సెలబ్రిటీలు ఇదివరకు పలు సందర్భాలలో వెల్లడించారు. తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ సైతం అనుష్క గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

అనుష్క చాలా మంచి మనసు కలిగిన వ్యక్తి అని తెలిపారు. అనుష్కను చూస్తే ఇలాంటి మనుషులు కూడా ఈ భూమి మీద ఉన్నారా అనే సందేహం కలుగుతుందని తెలిపారు. అనుష్క నుంచి ప్రతి ఏడాది సెప్టెంబర్ నెలలో నాకు ఒక ఐఫోన్ గిఫ్ట్ గా వస్తుందని ఈయన తెలిపారు. ఇలా ఆమె నా పట్ల చూపిస్తున్న ఈ ప్రేమకు నేను కృతజ్ఞుడిని అంటూ అనుష్క గురించి తమన్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారడంతో అభిమానులు కూడా షాక్ అవుతున్నారు.

ప్రతి ఏడాది ఐఫోన్ కానుకగా పంపించడం అంటే మామూలు విషయం కాదు. ఈ ఫోను ఖరీదు లక్షల్లో ఉంటుంది. ఇలా ప్రతి ఏడాది గిఫ్ట్ పంపించే అంత మంచి బాండింగ్ వీరిద్దరి మధ్య ఉందా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే వీరిద్దరి కాంబినేషన్లో కేవలం రెండు సినిమాలు మాత్రమే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

Share This Article
Exit mobile version