Anasuya : బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకొని అనంతరం వెండి తెర సినిమా అవకాశాలు అందుకున్న వారిలో యాంకర్ అనసూయ ఒకరు. కెరీయర్ మొదట్లో పలు న్యూస్ చానల్స్ లో న్యూస్ రీడర్ గా పనిచేస్తున్న అనసూయ అనంతరం యాంకర్ గా జబర్దస్త్ కార్యక్రమంలో సందడి చేస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు.. జబర్దస్త్ యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈమెకు మెల్లిమెల్లగా సినిమా అవకాశాలు కూడా వచ్చాయి.
ఇలా వరుస సినిమాలలో నటిస్తున్న అనసూయకు రంగస్థలం సినిమా తన కెరీర్ ను పూర్తిగా మార్చిందని చెప్పాలి. రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో నటించిన అనసూయ మంచి మార్కులే కొట్టేశారు. ఈ సినిమా తర్వాత వరుసగా సినిమా అవకాశాలు రావడంతో ఈమె జబర్దస్త్ కార్యక్రమానికి కూడా దూరమయ్యారు. ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే అనసూయ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.
Also Read : Anasuya: జానీ మాస్టర్ వ్యవహారం …సంచలన వ్యాఖ్యలు చేసిన అనసూయ!
Anasuya Opens Up About Her Husband’s Unfulfilled Wish
ఇక తన గురించి ఎవరైనా నెగిటివ్ కామెంట్లు చేసిన వారికి తన స్టైల్ లోనే వార్నింగ్ ఇస్తారు. ఇలా తన గురించి విమర్శలు చేసిన వారిపై తీవ్రస్థాయిలో మండిపడుతూ సోషల్ మీడియా వేదికగా ఈమె చేసే పోస్టులు ద్వారా వివాదాలలో నిలుస్తూ ఉంటారు. ఇకపోతే అనసూయ ప్రేమ వివాహం తన భర్త పిల్లల గురించి అందరికీ తెలిసిందే. ఇకపోతే గతంలో ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె తన భర్త గురించి బోల్డ్ కామెంట్స్ చేశారు.
అనసూయకు ఇద్దరు అబ్బాయిలు. తనకైతే అమ్మాయి కావాలని ఎంతో కోరికగా ఉండేదట. ప్రతి ఒక్క ఇంట్లో అమ్మాయి ఉంటేనే ఆ ఇల్లు ఎంతో సందడిగా ఉంటుందని నాకు కూడా అమ్మాయి ఉంటే బాగుండేదని ఎప్పుడూ అనిపిస్తుంది కానీ మా వారు మాత్రం నా కోరికను తీర్చడం లేదు అంటూ బోల్డ్ కామెంట్స్ చేసారు. తన భర్త ఇద్దరు పిల్లలు చాలు ముగ్గురు వద్దు అన్నారు అంటూ ఈమె చేసిన ఈ బోల్డ్ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక అనసూయ త్వరలోనే పుష్ప 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.