Ananya : సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందనే సంగతి మనకు తెలిసిందే. అయితే ప్రతి ఒక్క రంగంలో కూడా మహిళలు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సినిమా ఇండస్ట్రీలో మాత్రం ఇది కాస్త ఎక్కువగా ఉందనే విషయాన్ని ఎంతోమంది సెలబ్రిటీలు పలు సందర్భాలలో బయటపెట్టారు. అయితే తాజాగా క్యాస్టింగ్ కౌచ్ గురించి పవన్ కళ్యాణ్ బ్యూటీ అనన్య నాగళ్ళ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
మల్లేశం సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనన్య నాగళ్ళ (Ananya) తన అందచందాలతో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ఈమె పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో కూడా నటించి మరింత గుర్తింపు పొందారు.. ప్రస్తుతం పలు సినిమాల షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్న అనన్య తన సినిమా పొట్టేల్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Also Read : Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. హరిహర వీరుమల్లు రిలీజ్ డేట్ లాక్!
Pawan’s Leading Lady Ananya Bold Comments on Casting Couch
ఈ కార్యక్రమంలో భాగంగా రిపోర్టర్ రెమ్యూనరేషన్ గురించి కాస్త తేడాగా ప్రశ్నించారు. ఆయన ప్రశ్నకు ఈమె కూడా తనదైన స్టైల్ లోనే సమాధానం చెప్పి నోరు మూయించారు. ఇండస్ట్రీకి తెలుగు అమ్మాయిలు రావడానికి భయపడతారు. అందులో ఒకటి కాస్టింగ్ కౌచ్. హీరోయిన్ కి సినిమాల్లో అవకాశం ఇచ్చే ముందు కమిట్మెంట్ అడుగుతారట నిజమేనా అంటూ ఒక లేడీ రిపోర్టర్ ప్రశ్నించారు.
ఈమె ప్రశ్నకు స్పందించిన అనన్య సమాధానమిస్తూ.. మీరు ఇంత క్లియర్ ఎలా చెప్పగలుగుతున్నారు? అని తిరిగి ప్రశ్నిస్తుంది. వెంటనే ఆ రిపోర్టర్ అగ్రిమెంట్లో కూడా కమిట్మెంట్ ఉంటుందనీ ఇండస్ట్రీలో కొంతమంది చెబుతున్నారు అనగా.. మీరు అనుకుంటుంది 100% రాంగ్. నేనెప్పుడూ అలాంటి అనుభవాలను ఎదుర్కోలేదని తెలిపారు.
ఇక ఆ రిపోర్టర్ అంతటితో ఆగకుండా కమిట్మెంట్ ఇస్తే ఒక రేటు, ఇవ్వకపోతే మరోక రేటు ఉంటుందట కదా అని మళ్లీ ప్రశ్నించింది. దీంతో కాస్త ఆగ్రహానికి గురైన అనన్య మీరు ఎక్స్పీరియన్స్ చేయకుండా ఎలా మాట్లాడుతున్నారు మీరు ఇతరులు చెప్పిన మాటలు విని చెబుతున్నారు కదా, నేను స్వయంగా అనుభవంతో చెప్తున్నా అలాంటివి ఇండస్ట్రీలో లేవు అంటూ కాస్త గట్టిగానే సమాధానం చెప్పారు. అయితే కమిట్మెంట్ ఇవ్వాలా వద్దా అన్నది మన వ్యవహార శైలి పై ఆధారపడి ఉంటుందని, ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు కమిట్మెంట్ ఇస్తారనుకోవడం తప్పు అంటూ ఈ వ్యాఖ్యలపై మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.