Amaran: రికార్డ్ స్థాయిలో అమరన్ ఓపెనింగ్స్… ఎన్ని కోట్లంటే?

2 Min Read

Amaran : దేశం కోసం ప్రాణాలు అర్పించి అమరుడైన మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా తెరికెక్కిన అమరన్(Amaran) అనే సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసినదే. హీరో శివ కార్తికేయన్ సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమా దీపావళి పండుగను పురస్కరించుకొని అక్టోబర్ 31వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంది.రాజ్ కుమార్ పెరియాసామి దర్శకత్వంలో కమల్ హాసన్ నిర్మాణ సంస్థలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇండియన్ ఆర్మీ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? సాధించిన కలెక్షన్లు ఎంత అనే వివరాల్లోకి వెళితే..జమ్ము, కశ్మీర్‌లో మిలిటెంట్లను అత్యంత ధైర్య సాహసంతో ఎదుర్కొని యుద్ధభూమిలో అమరుడైన ఈ యోధుడి కథను సుమారుగా 200 కోట్ల వరకు బడ్జెట్ కేటాయించారని తెలుస్తుంది. పెద్ద ఎత్తున ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించడంతో ఈ సినిమా పై భారీ స్థాయిలో అంచనాలు కూడా ఏర్పడ్డాయి.

Also Read : Annavaram Movie: బాలయ్య వద్దంటే.. పవన్ కల్యాణ్ బ్లాక్‌బస్టర్ కొట్టిన సినిమా ఏంటో తెలుసా?

Amaran

ఇక సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమాపై అంచనాలను పెంచడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరుపుకుంది.సినిమా థియేట్రికల్ హక్కులను 65 కోట్లకుపైగా జరిగింది. తమిళనాడు హక్కులు 40 కోట్లు,తెలుగు రాష్ట్రాల హక్కులు 7 కోట్లు,ఓవర్సీస్, నార్త్ ఇండియా హక్కులు 18 కోట్ల అమ్ముడుపోయాయి. ఓవరాల్ గా ఈ సినిమా 65 కోట్ల షేర్ 130 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ టార్గెట్ గా బాక్సాఫీస్ బరిలో దిగింది.

ఇక ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ విషయానికి వస్తే అన్ని రాష్ట్రాలలో కలిపి 27 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది అలాగే మొదటి రోజు ఓపెనింగ్స్ లో భాగంగా ఈ సినిమా తమిళనాడు ఆంధ్ర తెలంగాణ ఓవర్సీస్ తో కలిపి ఏకంగా 35 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చాయని ట్రేడ్ వర్గాల నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ సినిమాకు మరింత పాజిటివ్ రెస్పాన్స్ వస్తే కలెక్షన్లు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని ఇదే మాదిరిగా కలెక్షన్లను రాబడితే బ్రేక్ ఈవెన్ సాధించడం పెద్ద కష్టతరం ఏం కాదని తెలుస్తోంది.

Share This Article