Akira : మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. చిరంజీవితో అకీరా ఫస్ట్ సినిమా?

2 Min Read

Akira: మెగా కుటుంబం నుంచి ఇప్పటికే ఎంతో మంది హీరోలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ కూడా ఇండస్ట్రీలోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తారా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇక ఈయనకు సినిమాలు పెద్దగా ఇష్టం లేదని మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అంటూ పలు సందర్భాలలో తన తల్లి రేణు దేశాయ్ తెలియజేశారు.

ఇకపోతే పవన్ కళ్యాణ్ , మెగా అభిమానులు మాత్రం అకీరాను హీరోగా చూడాలని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే త్వరలోనే వీరి కోరిక నెరవేరబోతుందని వెండితెరపై పవన్ వారసుడిని చూడబోతున్నారు అంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. అంటే అకీరా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారా అంటే హీరోగా అని కాదు కానీ తన పెదనాన్న చిరంజీవి నటిస్తున్న సినిమాలో ఒక కీలక పాత్రలో అకీరా నటించబోతున్నారంటూ ఒక వార్త వైరల్ అవుతుంది.

Also Read: Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. హరిహర వీరుమల్లు రిలీజ్ డేట్ లాక్!

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి వశిష్ట డైరెక్షన్ లో విశ్వంభర అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలుస్తుంది. చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాకు ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఇప్పటికే ఈ సినిమా దాదాపు 80% టాకీ పార్ట్ పూర్తి చేసుకుందని తెలుస్తోంది. అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుంది. ఇక ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి పండుగను పురస్కరించుకొని విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు.

ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రాబోతున్న నేపథ్యంలో వివిధ భాష చిత్రాలలో నటిస్తున్న స్టార్ సెలబ్రిటీలను కూడా ఈ చిత్రంలో భాగం చేశారని తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కుమారుడు ఆకీరా కూడా ఒక పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం. అతి త్వరలోనే అకీరా ఈ సినిమా షూటింగ్లో కూడా పాల్గొనబోతున్నట్టు సమాచారం. మరి అకీరా గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.

Share This Article
Exit mobile version