Akhira Nandhan సినీ ఎంట్రీ పై వ్యాఖ్యలు చేసిన మెగా డాటర్..

2 Min Read

Akhira Nandhan ; సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న వారిలో నటుడు పవన్ కళ్యాణ్ ఒకరు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ తన టాలెంట్ తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈ విధంగా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్న పవన్ కళ్యాణ్ ఇటీవల రాజకీయాలలోకి వచ్చి అక్కడ కూడా మంచి విజయాలను అందుకొని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు.

ఇల రాజకీయాలలో బిజీగా ఉన్న నేపథ్యంలో ఈయన సినిమాలను కూడా తగ్గించారని చెప్పాలి. ఇకపోతే పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా గురించి పరిచయం అవసరం లేదు. అకీరా సినీ ఎంట్రీ కోసం అభిమానులందరూ కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈయన ఉన్నత చదువులు చదువుతున్నప్పటికీ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ వారసుడిగా అకీరా ఇండస్ట్రీలోకి రావడం గురించి తాజాగా మెగా డాటర్ నిహారిక చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

అకీరా సినీ ఎంట్రీ గురించి ఇప్పటికే నటి రేణు దేశాయ్ పలు సందర్భాలలో మాట్లాడుతూ తను సినిమా ఇండస్ట్రీలోకి వస్తాడా రాడా అనేది నాకు తెలియదని, తనకు ఇంట్రెస్ట్ ఉంటే కచ్చితంగా వస్తాడని, తనకు ఏది నచ్చితే ఆ రంగంలోనే కొనసాగుతాడని తెలిపింది. అయితే నిహారిక తాజాగా అకీరా సినీ ఎంట్రీ గురించి మాట్లాడుతూ..అకీరా.. చాలా చిన్నవాడు. వాడికి సినిమాలలోకి వచ్చే ఆలోచన ఉందని తెలియదు. ఇక నేను కూడా నువ్వు సినిమాలలోకి వస్తావా అని ఎప్పుడూ అడగలేదని తెలిపారు.

niharika Answers question on Akira Nandhan debut1

అకీరా ఇంకా చాలా యంగ్.. తనకు ఇండస్ట్రీలోకి రావాలని ఉంటే తప్పకుండా వస్తారు అంటూ నిహారిక తన తమ్ముడి సినీ ఎంట్రీ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ వీడియో చూసిన పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఈ వీడియోని మరింత వైరల్ చేస్తున్నారు. అయితే అకీరాకు నటన కంటే కూడా మ్యూజిక్ అంటేనే చాలా ఇష్టమని పలు సందర్భాలలో తను కంపోజ్ చేసిన మ్యూజిక్ ను తన తల్లి రేణు దేశాయ్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.

Also Read : చరణ్ సినీ కెరియర్ లోనే షూటింగ్ మధ్యలో ఆగిపోయిన సినిమా

  1. Niharika Konidela About Movie With Akira Nandan – Mana Stars ↩︎

Share This Article
Exit mobile version