Balakrishna: బాలయ్య కాళ్లకు నమస్కరించిన ఐశ్వర్య రాయ్… ఫిదా అవుతున్న ఫ్యాన్స్?

2 Min Read

Balakrishna: అబుదాబి వేదికగా ఐఫా అవార్డుల కార్యక్రమం ఘనంగా జరుగుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున సినీ తారలు పాల్గొని సందడి చేస్తున్నారు. కేవలం టాలీవుడ్ సెలబ్రిటీలు మాత్రమే కాకుండా కోలీవుడ్, బాలీవుడ్ శాండిల్ వుడ్ తారలందరూ కూడా ఈ వేడుకలలో పాల్గొని సందడి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఐఫా వేడుకలకు సంబంధించిన ఫోటోలు వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ ఐఫా అవార్డులలో భాగంగా పలు సినిమాలకు గాను సెలబ్రిటీలు అవార్డులను అందుకున్నారు. అయితే ఈ కార్యక్రమంలో ఒక అరుదైన సంఘటన చోటుచేసుకుంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ సైతం ఈ వేడుకలలో అవార్డును అందుకున్నారు. ఈమె మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన పొన్నియన్ సెల్వన్ అనే సినిమాలో నటించిన సంగతి మనకు తెలిసిందే.

Also Read : కూలీలో రజినీ పేరు రివీల్… ఆ బ్లాక్ బస్టర్ మూవీకి లింక్ పెడుతున్న లోకేష్

ఇక ఈ సినిమాలో నటించినందుకు గాను ఈమెకు ఉత్తమ నటిగా అవార్డు వరించింది. అయితే ఈ అవార్డును అందుకోవడం కోసం ఈమె వేదిక పైకి వెళ్లారు. అయితే బాలయ్య చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోబోతున్నారు. ఒకసారిగా ఐశ్వర్యరాయ్ వేదిక పైకి వెళ్ళగానే బాలయ్య పాదాలకు నమస్కరించి ఆయన ఆశీర్వాదాలు తీసుకున్న తర్వాత ఈ అవార్డును అందుకున్నారు.

ఈ విధంగా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అయినటువంటి ఐశ్వర్య రాయ్ బాలకృష్ణ కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో బాలయ్య అభిమానులు ఐశ్వర్య రాయ్ సంస్కారానికి ఫిదా అవ్వడమే కాకుండా మీరు మరో మెట్టు పైకి ఎక్కారు అంటూ ఈమె పట్ల ప్రశంసలు కురిపిస్తున్నారు. కెరియర్ పరంగా ఈమె ఎంతో పెద్ద స్టార్ హీరోయిన్ అయినప్పటికీ ఒదిగే ఉన్నారని ఈమె డౌన్ టు ఎర్త్ అంటూ కామెంట్ లు చేస్తున్నారు.

Share This Article
Exit mobile version