Aditya Om : మిడ్ వీక్ ఎలిమినేషన్ లో బయటకు వచ్చేసిన ఆదిత్య ఓం.. రెమ్యూనరేషన్ ఎంతంటే?

2 Min Read

Aditya Om : బిగ్ బాస్ సీజన్ 8 కార్యక్రమంలో భాగంగా కంటెస్టెంట్ గా పాల్గొన్న వారిలో ఇప్పటికే నలుగురు కంటెస్టెంట్లు హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఇలా నాలుగు వారాలు పూర్తిచేసుకుని నలుగురు బయటకు రాగా ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని నాగార్జున తెలిపారు. అయితే మిడ్ వీక్ ఎవరు బయటకు వెళ్తారని అందరూ పెద్ద ఎత్తున సందేహాలు వ్యక్తం చేశారు.

ఇకపోతే గురువారం సాయంత్రం బిగ్ బాస్ నిద్రపోతున్న కంటెస్టెంట్లు అందరినీ లేపి నామినేషన్స్ లో ఉన్నవారు ముందుకు రావాలని చెప్పారు. ఇలా నామినేషన్ లో ఉన్నవారిలో అందరికంటే ఆదిత్య ఓం(Aditya Om) తక్కువ శాతం ఓటింగ్ సంపాదించుకున్నారు. దీంతో ఈయన ఎలిమినేట్ అంటూ బిగ్ బాస్ తెలియజేశారు. ఇలా నాలుగు వారాల నాలుగు రోజులపాటు ఈయన హౌస్ లో కొనసాగే హౌస్ నుంచి బయటకు వచ్చారు.

Also Read : Bigg Boss 8 : వైల్డ్ కార్డు ఎంట్రీ కంటెస్టెంట్ ను రివీల్ చేసిన బిగ్ బాస్ ఎవరో తెలుసా?

ఈ విధంగా ఆదిత్య ఓం నాలుగు వారాలపాటు హౌస్ లో కొనసాగినందుకు భారీ మొత్తంలోనే రెమ్యూనరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది. సోషల్ మీడియాలో వచ్చిన సమాచారం ప్రకారం ఆదిత్య ఓం వారానికి మూడు లక్షల రూపాయలు చొప్పున అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. ఇలా నాలుగు వారాల నాలుగు రోజులపాటు హౌస్ లో కొనసాగిన ఆదిత్య సుమారు 14 లక్షలు వరకు రెమ్యూనరేషన్ అందుకున్నారని సమాచారం.

ఇక మిడ్ వీక్ ఆదిత్య ఓం ఎలిమినేట్ కాగా ఈ వీకెండ్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే విషయంపై ఎంతో ఆసక్తి నెలకొంది. ఇక ఈ ఆదివారం వైల్డ్ కార్డు ఎంట్రీ కూడా ఉండబోతున్న సంగతి మనకు తెలిసిందే. సీజన్ 8 కావడంతో ఎనిమిది మంది వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు అయితే ఈ ఎనిమిది మంది కూడా గత సీజన్లలో పాల్గొన్న కంటెస్టెంట్లు కావటం విశేషం. ఇప్పటికే వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వబోయే కంటెస్టెంట్లకు సంబంధించిన పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇలా వైల్డ్ కార్డు ద్వారా హరితేజ, నయని పావని, రోహిణి, గంగవ్వ, ముక్కు అవినాష్, మెహబూబ్, టేస్టీ తేజ వెళ్ళబోతున్నారంటూ వార్తలు వినపడుతున్నాయి. మరి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నటువంటి వారు ఎవరు ఏంటి అనే విషయాలు ఈ ఆదివారం తెలియనున్నాయి. అయితే ఇప్పటికే టేస్టీ తేజకు సంబంధించి అఫీషియల్ గా బిగ్ బాస్ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే.

Share This Article
Exit mobile version