Uday Kiran : సినిమా ఇండస్ట్రీలోకి ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి హీరోగా అతి తక్కువ సమయంలో అవకాశాలను అందుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా సక్సెస్ అందుకున్న వారిలో నటుడు ఉదయ్ కిరణ్ ఒకరు. చిత్రం సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన ఉదయ్ కిరణ్ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా గుర్తింపు పొందారు. ఎంతగా అంటే ఉదయ్ కిరణ్ సినిమా వస్తుంది అంటే స్టార్ హీరోలు కూడా తమ సినిమాలను వాయిదా వేసుకునే స్థాయికి ఉదయ్ కిరణ్ ఎదిగారు.
ఇలా ఎంత తొందరగా ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. అంతే తొందరగా ఈయన అవకాశాలను కోల్పోయారు. సినిమా అవకాశాలు లేకపోవడంతో ఎంతో మనస్థాపానికి గురైన ఉదయ్ కిరణ్(Uday Kiran) ఆత్మహత్య చేసుకుని మరణించారు. తాజాగా ఉదయ్ కిరణ్ మరణం గురించి బిగ్ బాస్ కంటెస్టెంట్ హీరో ఆదిత్య ఓం చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Also Read: Siddharth : సిద్దార్థ్ తన పెళ్లిలో పెట్టుకున్న ఈ వాచ్ ఖరీదు ఎంతో తెలుసా?
Uday Kiran Death : Aditya Om’s Shocking Revelation on the Real Cause!
బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత ఆదిత్య ఓం వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఇండస్ట్రీలో హీరోల పరిస్థితిని ఈయన వివరించారు. ఇక ఈ ఇంటర్వ్యూలో ఉదయ్ కిరణ్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.ఉదయ్ కిరణ్ ఆత్యహత్య గురించి ప్రశ్నించగా.. ఉదయ్ కిరణ్ టాలెంటెడ్, సక్సెస్ పుల్ హీరో. అయితే.. సక్సెస్ లో ఉన్న వ్యక్తికి సడెన్ గా ఫెయిల్యూర్స్ రావడంతో ఆ సిచ్యూవేషన్స్ తట్టుకోలేకపోయారు.
ఇండస్ట్రీలో నాకు ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయని తెలిపారు. ఇండస్ట్రీలో హీరోగా కొనసాగడం కంటే క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగడం చాలా మంచిదని తెలిపారు. హీరోగా అయితే హీరో పాత్రలలోనే చేయాలి సినిమాలు చేయకపోతే ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తారు. ఒకవేళ సక్సెస్ కాకపోతే సినిమాలు ఎందుకు సక్సెస్ కాలేదని ప్రశ్నిస్తారు. హీరోగా ఇండస్ట్రీలో కొనసాగాలి అంటే మెంటల్ హెల్త్ బాగుండాలని ఆదిత్య ఓం తెలిపారు. ఉదయ్ కిరణ్ ఈ పరిణామాలు తట్టుకోలేకపోయాడు. నాతో రెండు సినిమాలు చేసిన విజయ్ సాయి కూడా ఇలానే సూసైడ్ చేసున్నారు. ఎలాంటి బ్యాక్ గ్రౌడ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టాలంటే.. మెంటల్ హెల్త్ చాలా ముఖ్యం, అది లేకుండా ఉండటమంటే చాలా కష్టం అంటూ ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.