Siddarth: అలా పెళ్లి జరిగిందో లేదో భార్యపై సంచలన వ్యాఖ్యలు చేసిన సిద్ధార్థ్.. నచ్చదంటూ?

1 Min Read

Siddarth: సినీ నటుడు సిద్ధార్థ్ ఇటీవల నటి అదితి రావు హైదరి మెడలో మూడు ముళ్ళు వేసిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట తెలంగాణలోని వనపర్తి జిల్లాల్లో పురాతన ఆలయం అయిన శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో సాంప్రదాయ బద్దంగా ఈ వివాహం జరిగింది. ఇక వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ వివాహ వేడుకలలో భాగంగా వీరిద్దరూ సాంప్రదాయ దుస్తులు ధరించి ఎంతో చూడముచ్చటగా కనిపించారు. మహాసముద్రం సినిమాతో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడటం ఆ పరిచయం ప్రేమగా మారడంతో పెద్దల సమక్షంలో పెళ్లి పీటలు ఎక్కారు. ఇలా నిజ జీవితంలో ఒకటైన ఈ జంట ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఈయనకు ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురయింది.

ఆదితి రావు హైదరి ఉదయాన్నే మొదట ఏం చేస్తుందని అడిగినప్పుడు, ఆమె తన ఇష్టానుసారం, సమ్మతి లేకుండా తనను నిద్రలేపుతుందని సిద్దార్థ్ వెంటనే సమాధానం ఇచ్చారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..సూర్యుడు ఉదయించినప్పుడు మేల్కోవాలని అన్నారు.నా రోజు ప్రారంభమైందని తెలిసి నేను అయిష్టంగానే కన్నీళ్లతో మేల్కొంటాను అంటూ సిద్ధార్థ్ ప్రతిరోజు ఉదయం తనకు ఇష్టం లేనటువంటి పనిని ఆదితి చేస్తోంది అంటూ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ సినిమా తర్వాత వీరిద్దరూ వారి కెరియర్ పట్ల బిజీగా ఉంటూ పలు సినిమాలలో నటిస్తూ ఉన్నారు. ఇక సిద్ధార్థ్ ఇటీవల భారతీయుడు 2 సినిమాలో కనిపించిన సంగతి తెలిసిందే. ఇకపోతే ఇటీవల ఈయన సినిమాలు అనుకున్న స్థాయిలో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి.

Share This Article
Exit mobile version