Suman : పవన్ కళ్యాణ్ మూడు కాకుంటే 30 పెళ్లిళ్లు చేసుకుంటాడు మీకేంటి నొప్పి

Suman : సినీ నటుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి తాజాగా మరోసారి నటుడు సుమన్ (Suman) సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడంతో తరచూ ఈయన పెళ్లిళ్ల గురించి విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ రాజకీయ కార్యక్రమాలకు వెళ్లిన బహిరంగ సభలు నిర్వహించిన అక్కడ మాత్రం పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి ప్రస్తావనకు తీసుకువచ్చేవారు.

ఇలా ప్యాకేజీ స్టార్ అంటూ మూడు పెళ్లిళ్ల స్టార్ అంటూ పవన్ కళ్యాణ్ గురించి జగన్ తరచు మాట్లాడటంతో వైకాపా నేతలు సైతం పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ తన పెళ్లిళ్ల గురించి ప్రస్తావన చేసేవారు. అయితే ఈ విమర్శలు కాస్త శృతిమించడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు జనసైనికులు ఓట్ల రూపంలో జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పారు. గత ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డిని కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం చేస్తూ ప్రతిపక్ష నేత హోదా కూడా లేకుండా చేశారు.

Also Read : Pawan Kalyan: తిరుపతి లడ్డు అపవిత్రం చేశారని మేము ఎక్కడ చెప్పలేదు

Suman

2019వ సంవత్సరంలో ఏకంగా 151 స్థానాలలో గెలిచి అద్భుతమైన మెజారిటీ సాధించిన జగన్ 2024 ఎన్నికలలో కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యారు. ప్రస్తుతం ప్రతిపక్ష నేత హోదా కూడా లేకుండా జగన్ ఉన్నారు. తనకు ప్రతిపక్ష నేతగా హోదా ఇస్తేనే అసెంబ్లీలోకి అడుగు పెడతానని భీష్మించుకొని కూర్చున్నారు. ఇదిలా ఉండగా తాజాగా హీరో సుమన్ పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి మరోసారి మాట్లాడారు.

ఇటీవల ఈయన ఫ్రాంక్లీ స్పీకింగ్ అని ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ పెళ్లిళ్ల గురించి ప్రస్తావనకు రావడంతో పవన్ కళ్యాణ్ మూడు కాకుంటే 30 పెళ్లిళ్లు చేసుకుంటారు మీకేంటి నొప్పి అంటూ ఎదురు ప్రశ్నించారు. నేను ఒక సినిమా వ్యక్తిగా ఎప్పుడూ సినిమా ఇండస్ట్రీకి సపోర్ట్ చేస్తాను. ఈ విషయంలో నేను పవన్ కళ్యాణ్ కి మద్దతు తెలుపుతానని తెలిపారు. ఇక పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్న తన పిల్లల బాధ్యతలను మాత్రం ఎంతో చక్కగా నిర్వర్తిస్తూ ఉన్నారు. రెండో భార్య పిల్లల బాగోగులను వారి బాధ్యతలను కూడా తీసుకున్న సంగతి మనకు తెలిసిందే.

Share This Article
Exit mobile version