Abhai Naveen: బిగ్ బాస్ ను తిట్టడానికి అదే కారణం…

2 Min Read

Abhai Naveen: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కార్యక్రమం ప్రస్తుతం ప్రసారమవుతూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. 14 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఈ కార్యక్రమం మూడు వారాలు పూర్తిచేసుకుని హౌస్ నుంచి ముగ్గురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. ఇక మూడవ వారంలో భాగంగా హౌస్ నుంచి కంటెస్టెంట్ అభయ్ నవీన్ (Abhai Naveen) ఎలిమినేట్ అయిన సంగతి మనకు తెలిసిందే.

అయితే ఈయన బిగ్ బాస్ ను ఘోరంగా తిట్టడంతో ఎలిమినేట్ అయ్యారని అందరూ భావిస్తున్నారు కానీ ఓటింగ్ పరంగా కూడా ఈయనకు చాలా తక్కువ శాతం ఓటింగ్ రావడంతో ఎలిమినేట్ అయ్యారని తెలుస్తోంది. ఈ విధంగా అభయ్ (Abhai Naveen) బిగ్ బాస్ ను ఇష్టానుసారంగా తిట్టడంతో నాగార్జున సైతం ఈయనకు తనదైన స్టైల్ లోనే క్లాస్ పీకారు.

Abhai Naveen BB 8 Telugu

అయితే హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నవీన్ పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఎందుకు బిగ్ బాస్ ను తిట్టాల్సి వచ్చింది అనే విషయాల గురించి వెల్లడించారు. ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ ఈయనని ప్రశ్నిస్తూ అసలు బిగ్ బాస్ ను మీరు ఎందుకు తింటారు..ఒక మనిషి పదిమందికి వంట చేయొచ్చు. అలాంటి ముగ్గురు ఆరుగురికి వంట చేయలేరా? అని ప్రశ్నించగా అభయ్ ఆసక్తికర సమాధానం చెప్పారు.

Abhay Naveen Comments On Bigg Boss

ముగ్గురు ఆరుగురికి వంట చేయవచ్చు కానీ మాకు మూడు రోజుల నుంచి సరైన తిండి లేదు తిండి లేకపోవడంతో రేషన్ వచ్చింది రేషన్ వచ్చిందని సంతోష పడేలోపు టైమర్ కూడా వచ్చింది. ఒక గంటలో అంత మందికి వంట చేయడం సాధ్యం కాదు. ఎలాంటి కండిషన్స్ లేకుండా ఉంటే వంట చాలా సులభంగా చేయొచ్చు కానీ గంటలోపే చేయాలి అంటే కష్టమని తెలిపారు..

Also Read : https://teluguvaradhi.com/change-in-telugu-bigg-boss-house-rules/

ఇక నేను ఏదైనా అంటే అన్నారు అంటారు కానీ రేపటి కోసం కూడా ముందు రోజే అక్కడ ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి అలాంటి ఫుడ్ తినటం వల్ల చాలామంది ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా ఆదిత్య ఓం చాలా ఇబ్బంది పడ్డారని అభయ్ తెలిపారు. అందుకే బిగ్ బాస్ మీద రియాక్ట్ కావాల్సి వచ్చింది. దెబ్బ తగిలిన తరువాత మందు పెట్టుకోవడం కంటే.. దెబ్బ తగలకుండా చూసుకోవడమే మేలు కాదా అనేది నా పాలసీ అంటూ మరోసారి ఈయన బిగ్ బాస్ ను తిట్టడం గురించి సెటైరికల్ గా చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Share This Article