Aadhaar Update : ఉచిత ఆధార్ అప్‌డేట్ గడువు పొడిగింపు, జూన్ 14, 2025 వరకు అవకాశం.

Aadhaar Update : భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) తన ఆన్‌లైన్ వేదిక, మైఆధార్ (myAadhaar) ద్వారా ఉచిత ఆధార్ అప్‌డేట్‌ల గడువును మరోసారి పొడిగించింది. ఈ సదవకాశాన్ని ఉపయోగించుకుని ప్రజలు తమ ఆధార్ కార్డ్‌లో అవసరమైన మార్పులను జూన్ 14, 2025 వరకు ఉచితంగా చేసుకోవచ్చు.

గతంలో, ఉచిత ఆధార్ కార్డ్ అప్‌డేట్ గడువు డిసెంబర్ 14గా నిర్ణయించబడింది. అయితే, ప్రజలకు మరింత సమయం కల్పించే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ గడువును పొడిగించింది.

ఉచిత సేవలో మీరు చేసుకోగలిగే మార్పులు:

ఈ ఉచిత సేవ ద్వారా, ఆధార్ కార్డ్ (Aadhaar Update) హోల్డర్లు తమ వ్యక్తిగత వివరాలను, అనగా పేరు, పుట్టిన తేదీ, చిరునామా మరియు ఫోన్ నంబర్ వంటి జనాభా సమాచారాన్ని (Demographic Information) అప్‌డేట్ చేసుకోవచ్చు.

 వేలిముద్రలు, ఐ స్కానింగ్ లేదా ఆధార్ ఫోటో వంటి బయోమెట్రిక్ సమాచారాన్ని మార్చుకోవాలంటే మాత్రం, మీరు తప్పనిసరిగా దగ్గరలోని ఆధార్ కేంద్రాన్ని సందర్శించాలి. ఈ సేవలకు నిర్ధిష్ట రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

Also Read : APY Scheme: కేవలం రూ. 210 డిపాజిట్ చేస్తే.. రూ. 60,000 పెన్షన్ పొందొచ్చు

Free Aadhaar Update

మీ ఆధార్ వివరాలను ఎలా అప్‌డేట్ చేసుకోవాలి?

  • ముందుగా, UIDAI అధికారిక వెబ్‌సైట్ ‘మైఆధార్’ (myAadhaar) ను సందర్శించండి.
  • తరువాత, మీ 12 అంకెల ఆధార్ నంబర్‌ను, మరియు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చే OTPని ఉపయోగించి లాగిన్ అవ్వండి.
  • లాగిన్ అయిన తరువాత, మీ వ్యక్తిగత వివరాలను ధృవీకరించండి, మరియు మీరు చేయాలనుకుంటున్న మార్పులను చేర్పులను జాగ్రత్తగా చేయండి.
  • మీరు అప్‌డేట్ చేస్తున్న వివరాలకు సరైన ధృవీకరణ పత్రాలను (Supporting Documents) తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలి.
  • అప్‌డేట్ అభ్యర్థనను పంపిన తరువాత, మీకు 14 అంకెల URN (Update Request Number) కేటాయించబడుతుంది. ఈ నంబర్‌ను భద్రపరుచుకోండి, దీని ద్వారా మీరు మీ అప్‌డేట్ అభ్యర్థన స్టేటస్ తెలుసుకోవచ్చు.
  • మీ అప్‌డేట్ అభ్యర్థన ఆమోదించబడిన తరువాత, మీరు మీ తాజా ఆధార్ కార్డ్‌ను మైఆధార్ వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
  • Aadhar update official website: https://appointments.uidai.gov.in/easearch.aspx

ఈ ఆధార్ అప్‌డేట్ కోసం ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా తమ వివరాలను సరిచేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. సరైన మరియు తాజా సమాచారంతో కూడిన ఆధార్ కార్డ్ (Aadhaar Update) కలిగి ఉండటం వలన వివిధ ప్రభుత్వ మరియు ప్రభుత్వేతర పథకాల ప్రయోజనాలను సులభంగా పొందవచ్చు. ఈ ఉచిత ఆధార్ అప్‌డేట్ సేవను సద్వినియోగం చేసుకోండి మరియు జూన్ 14, 2025 లోపు మీ ఆధార్ కార్డ్‌లో అవసరమైన మార్పులు చేసుకోండి.

Aadhar update official website: https://appointments.uidai.gov.in/easearch.aspx

Share This Article
Exit mobile version