Tirumala : తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా బిఆర్ నాయుడు ఇటీవల బాధ్యతలు తీసుకున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈయన కొత్త చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఇప్పటివరకు బోర్డు సభ్యులతో సమావేశాన్ని ఏర్పాటు చేయలేదని తెలుస్తుంది. అయితే త్వరలోనే ఈయన బోర్డు మీటింగ్ కూడా ఏర్పాటు చేయబోతున్నట్టు సమాచారం.
నూతన చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న బి.ఆర్ నాయుడు ఆలయంలోని అన్ని విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించినట్లు తెలుస్తోంది. ఇక ఈయన భక్తులతో పాటే స్వామి వారి ఆలయంలోనే అన్న ప్రసాదం తిన్నారు. అనంతరం భక్తులతో మాట్లాడుతూ వారికి కలుగుతున్నటువంటి ఇబ్బందులను గురించి అడిగి తెలుసుకున్నారని తెలుస్తుంది.
Also Read : Pawan Kalyan: ప్రాయశ్చిత్త దీక్ష లడ్డు కోసం కాదు… సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్!
New Rules in Tirumala: Strict Measures Lead to Jail for Certain Remarks
ఈ క్రమంలోనే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన దేవస్థానం గురించి పలు విషయాలు తెలియజేశారు. ఇప్పటికే టీటీడీ ఎన్నో చట్టాలను అమలుపరుస్తుంది. అయితే సరికొత్త చట్టాలను తీసుకువచ్చే ఆలోచన లేదని. బిఆర్ నాయుడు తెలిపారు. ఇకపోతే చాలామంది భక్తులు మేము సుదూర ప్రాంతాల నుంచి వచ్చినప్పటికీ స్వామివారిని ఒక సెకండ్ కూడా చూడనివ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులు కంపార్ట్మెంట్లలో గంటల తరబడి కూర్చుంటున్నారు వారికి భోజన సదుపాయం కల్పించినప్పటికీ అలా వారిని బంధించి కూర్చోబెట్టడం మానవ హక్కులకు భంగం కలిగించడమేనని ఈయన తెలిపారు. ఇక ఈ విషయంలో మేము భక్తులకు టైమింగ్ ట్యాగ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. పలానా సమయానికి దర్శనం అంటే భక్తులు అదే సమయానికి అక్కడికి వచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇకపోతే తిరుమల (Tirumala) కొండపైకి వచ్చే ఎంతోమంది రాజకీయ నాయకులు కొండపైన ఇటీవల రాజకీయాల గురించి మాట్లాడుతున్న విషయం తెలిసిందే. అయితే ఇకపై రాజకీయ నాయకులు ఎవరు తిరుమలకు వచ్చిన వారు కొండపైన రాజకీయాల గురించి మాట్లాడకూడదు. అలాగే ఈ వీడియోలను టెలికాస్ట్ చేయకూడదు. రాజకీయాల గురించి మాట్లాడిన ఆ వీడియోలను టెలికాస్ట్ చేసిన వారి పట్ల కఠినమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా నూతన చైర్మన్ బిఆర్ నాయుడు తిరుమల ఆలయ ప్రతిష్టను కాపాడటం కోసం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ప్రశంసలు కురిపిస్తున్నారు.