YS Jagan: ఆ భయంతోనే ప్రతిపక్ష నేతగా హోదా ఇవ్వలేదు.. వైయస్ జగన్ సంచలన వ్యాఖ్యలు!

YS Jagan : వైయస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచినప్పటికీ అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకపోవడం పట్ల పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. వైయస్ జగన్మోహన్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీలోకి రావాలి అంటూ మంత్రులు ఎమ్మెల్యేలు సవాల్ విసురుతున్నారు. మరోవైపు జగన్ సోదరి షర్మిల సైతం అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. మీకు ప్రజలు ఓట్లు వేసి గెలిపించింది అసెంబ్లీకి వెళ్లి వారి తరఫున పోరాటం చేయాలని అలా కాకుండా మీరు ఇంట్లో కూర్చుని మైకు ముందు మాట్లాడటానికి కాదు అంటూ షర్మిల కౌంటర్ ఇచ్చారు.

ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి (YS Jagan) అసెంబ్లీకి రాకపోవడం గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఇక జగన్మోహన్ రెడ్డి మాత్రం తనకు ప్రతిపక్ష నేతగా హోదా ఇస్తేనే అసెంబ్లీలోకి అడుగు పెడతానని చెబుతున్నారు. నిబంధనల ప్రకారం ప్రతిపక్ష నేతగా హోదా ఇవ్వాలి అంటే 10% సీట్లు గెలవాల్సి ఉంటుంది. వైకాపా పార్టీకి ఆ స్థాయిలో విజయం లేకపోవడంతో ప్రతిపక్ష నేతగా హోదా అందుకోలేకపోయారు.

Also Read : ChandraBabu: లోకేష్ కోసమే ఎన్టీఆర్ ను దూరం పెట్టారా… బాలయ్య ప్రశ్నకు బాబు సమాధానం ఏంటి?

YS Jagan

ఇకపోతే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకపోతే ఆయన పై వేటువేసే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది. ఇలాంటి తరుణంలోనే వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ప్రతిపక్ష నేతగా హోదా ఇవ్వలేకపోతున్నారు అనే విషయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీకి 40 శాతం ఓట్ షేరింగ్ వచ్చింది కనుక మన పార్టీనే అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ అంటూ జగన్ తెలిపారు. ఇక మనకు ప్రతిపక్ష నేతగా హోదా ఇస్తే మనం అసెంబ్లీలో ఎక్కడ వారిని ప్రశ్నిస్తామనే భయంతోనే వైసీపీ పార్టీకి ప్రతిపక్ష పార్టీగా హోదా ఇవ్వడం లేదని తెలిపారు.

వైసీపీ ఎమ్మెల్సీలతో సమావేశమైన జగన్ ప్రభుత్వ విధి విధానాలపై నిలదీయాలని వారికి సూచనలు చేశారు. 40% ఓట్ షేరింగ్ ఉన్న మన పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంతోనే ప్రతిరోజు మీడియా ముందు సరైన ఆధారాలు పూర్తి వివరాలతో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామని ఈ సందర్భంగా జగన్ చేసిన కామెంట్స్ సంచలనగా మారాయి.

Share This Article