Ambati Rambabu : పవన్ కళ్యాణ్ స్క్రిప్ట్ కాదు.. సొంత బుర్ర వాడితే మంచిది…అంబంటి కౌంటర్!

Ambati Rambabu : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అంబటి రాంబాబు సెటైర్లు వేస్తూ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఇటీవల సోషల్ మీడియాలో కూటమి ప్రభుత్వ నేతల గురించి వారి కుటుంబాల గురించి అభ్యంతరకరంగా పోస్టులు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని హోం శాఖకు హెచ్చరికలు జారీ చేయడంతో ఎవరైతే సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు చేస్తున్నారో వారిపై ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతోంది.

ఈ క్రమంలోనే అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్ పట్ల తనదైన శైలిలోనే సెటైర్లు వేశారు. పవన్ కళ్యాణ్ ఏదైనా ఓ కార్యక్రమంలో మాట్లాడేటప్పుడు తన సొంత బుర్రవాడి మాట్లాడితే బాగుంటుందని సలహాలు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ తన సొంత తెలివి ఉపయోగించి కాకుండా రాసి ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారని అంబటి తెలిపారు. పవన్ కళ్యాణ్ ఏదైనా ఒక అంశంపై మాట్లాడారు అంటే ఎంతో ఆవేశం కనబరుస్తారు.

Also Read : Kiran Abbavaram : చాలా రోజుల తర్వాత కంటి నిండా నిద్రపోయాను

Ambati Rambabu

ఇలా ఒక అంశం గురించి ఆవేశంగా మాట్లాడిన పవన్ తిరిగి పది రోజుల తర్వాత ఎక్కడ కనిపించరు. ఇదే విషయం గురించి ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. మాజీ మహిళా మంత్రి అయినా విడుదల రజనీపై సోషల్ మీడియాలో ఎంతో అభ్యంతరకరమైన పోస్టులు పెట్టారు. మరి ఆ పోస్టులు పెట్టిన వారి పట్ల ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నారని అంబటి ప్రశ్నించారు. పోలీసులు చట్టపరంగా విధులు నిర్వహించడం లేదని చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగా నడుచుకుంటున్నారని తిరిగి తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కరిని వదిలిపెట్టము అంటూ పోలీసులకు కూడా హెచ్చరించారు.

Share This Article