Sri Reddy : ఏపీలో సోషల్ మీడియా పోస్టులపై ప్రభుత్వం కొరడా ఝళిపిస్తోంది. వైసీపీ నాయకులతో పాటు సోషల్ మీడియా కార్యకర్తలు, సానుభూతిపరుల్ని రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా వెంటాడుతోంది. ఇప్పటికే వందల సంఖ్యలో కేసులు కూడా నమోదు చేసింది. అలాగే చాలా మందిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై హైకోర్టులో సైతం హెబియస్ కార్పస్ పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ కూడా జరుగుతోంది. ఈ క్రమంలో గతంలో కూటమి నేతలపై విమర్శలు చేసిన వారంతా వరుసగా దారికొస్తున్నారు.
ఈ నేపథ్యంలో వివాదాస్పద నటి, యూట్యూబర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరురాలు శ్రీరెడ్డి తాజాగా వీడియో రిలీజ్ చేసి పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీకి, వైఎస్ జగన్‌కి అనుకూలంగా శ్రీరెడ్డి (Sri Reddy) పోస్టులు, వీడియోలు పెడుతుంటుంది. ఈ క్రమంలోనే టీడీపీ నేతలపైనా, ఆ పార్టీపైనా తనదైన శైలిలో విమర్శలు, వ్యాఖ్యలు చేస్తూ ఉంటుంది శ్రీరెడ్డి. అయితే తాజాగా శ్రీరెడ్డి(Sri Reddy) .. అధికార పార్టీ నాయకులకు సారీ చెప్పింది. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనితలకు శ్రీరెడ్డి క్షమాపణలు చెప్పింది. ఈ మేరకు ఓ వీడియో రిలీజ్ చేసింది. ఇక నుంచి మీ కుటుంబ సభ్యుల గురించి సోషల్ మీడియాలో తప్పుగా మాట్లాడనంటూ చెప్పుకొచ్చిన శ్రీరెడ్డి.. తమ కార్యకర్తలను దయచేసి వదిలి పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాంటూ వీడియో రిలీజ్ చేసింది.
Also Read : Pawan Kalyan : పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలలో తప్పులేదు.. స్పందించిన హోమ్ మినిస్టర్ అనిత!
Sri Reddy Apologizes: Humbling Herself After Letting Go of Ego
” పిచ్చుకలపై బ్రహ్మాస్త్రాలు వేయడం కరెక్ట్ కాదు. శరణు అన్నవారిని కూడా అరెస్ట్ చేయడం సరైంది కాదు. ఫైట్ చేయాలనుకుంటే హీరోతో పోరాటం చేయాలి కానీ.. సైడ్ క్యారెక్టర్లతో కాదు. స్థానికంగా ఉన్న కార్యకర్తలను పట్టుకుని చిత్రహింసలు పెడుతున్నారు. పైనున్న వాళ్లు బాగానే సంపాందించుకుంటున్నారు. కింద ఉన్న కార్యకర్తలు గుర్తింపు కోసం దూకుడుగా మాట్లాడుతారు. రాజకీయంగా ఎదగాలనే కక్కుర్తితోనే మేము పని చేస్తున్నాం. రాష్ట్రంలో ఇన్ని దారుణాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. మీ సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులను పట్టించుకోవడం లేదు. వారిని అరెస్ట్ చేయడం లేదు. ఇదేమైనా రాజనీతా? రాజనీతిలో మహిళలు, చిన్నారులను, శరణు అన్నవారిని వదిలేస్తారు. కానీ ఇలానా?”
https://www.facebook.com/iamsrireddy/videos/1060731202447514
“మీ అందరికీ పిల్లలు ఉన్నారు. మా ఇళ్లల్లోనూ పిల్లలున్నారు. పవన్ కళ్యాణ్ గారూ, లోకేష్ గారూ దయచేసి అధికారాన్ని ఉపయోగించి మంచి పనులు చేయండి. పెద్దవాళ్లతో పోరాటం చేయాల్సింది పోయి.. సోషల్ మీడియా కార్యకర్తలతో ఏంటండి. నారా లోకేష్, పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులకు నా క్షమాపణలు. అనిత గారికి క్షమాపణలు. నా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని, అలాగే నా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని.. ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు, నా సోషల్ మీడియాలో మీ గురించి, మీ ఫ్యామిలీ గురించి ఎలాంటి తప్పుడు పోస్టులు రావని చెప్తున్నా. అలాగే యుద్ధాన్ని కార్యకర్తలతో కాకుండా, నేతలతో చేయాలని వేడుకుంటున్నా. కార్యకర్తల కుటుంబాలను ఇబ్బంది పెట్టొద్దని, వారిని క్షమించమని వేడుకుంటున్నా.” అంటూ శ్రీరెడ్డి వీడియో విడుదల చేసింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. దాంతో టీడీటీ, జనసేన కార్యకర్తలు భిన్నమైన కామెంట్స్ చేస్తూ శ్రీరెడ్డిపై ఓ రేంజ్ లో విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్‌రెడ్డి కోసం వైఎస్సార్ జిల్లా పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు. 4 ప్రత్యేక బృందాలు అతడి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరుతో పాటు కమలాపురం, పులివెందుల ప్రాంతాలకు పోలీసు బృందాలు వెళ్లాయి. వర్రా రవీందర్‌రెడ్డి వాడే రెండు ఫోన్లూ స్విచ్ ఆఫ్‌లో ఉన్నాయని, అన్ని రకాలుగా నిఘా పెట్టామని పోలీసు అధికారులు తెలిపారు.