Upasana: చరణ్ తో ఆ హీరోయిన్ కెమిస్ట్రీ చాలా బాగుంటుంది.. ఉపాసన సంచలన వ్యాఖ్యలు!

2 Min Read

Upasana : ఉపాసన పరిచయం అవసరం లేని పేరు. మెగా ఇంటి కోడలుగా, రామ్ చరణ్ సతీమణిగా,
అపోలో ఆసుపత్రికి ఒక డైరెక్టర్ గా, మ్యాగజైన్ ఎడిటర్ గా ఈమె అందరికీ ఎంతో సుపరిచితమే. సినిమా ఇండస్ట్రీకి ఏమాత్రం సంబంధంలేని ఉపాసన రాంచరణ్ ప్రేమలో పడి ప్రేమించుకుని పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా 12 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు.

ఇలా వీరి వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉండటమే కాకుండా ఎందరికో ఆదర్శంగా నిలిచారని చెప్పాలి. వృత్తిపరంగా ఎంతో బిజీగా ఉండే ఈ దంపతులు వ్యక్తిగత జీవితంలో కూడా చాలా సంతోషంగా గడుపుతుంటారు. ఇటీవల ఉపాసన(Upasana) పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. సినిమా ఇండస్ట్రీకి ఏమాత్రం సంబంధంలేని ఉపాసన రామ్ చరణ్ ను పెళ్లి చేసుకుని మెగా ఇంట్లో అడుగు పెట్టడంతో మొదట్లో కాస్త ఇబ్బంది పడినట్లు ఈమె ఓ సందర్భంలో వెల్లడించారు.

Also Read : Ramcharan: చరణ్ సినిమాలో మరోసారి విలన్ గా స్టార్ హీరో

Upasana

రామ్ చరణ్ వృత్తి పరంగా హీరో కావడంతో ఈయన ఎంతోమంది హీరోయిన్లతో నటించాల్సి ఉంటుంది, వారితో రొమాన్స్ చేయాల్సి ఉంటుంది. మొదట్లో ఈ విషయం కాస్త అయోమయంగా ఉండేదని తర్వాత అలవాటు పడిందని ఉపాసన వెల్లడించారు. ఇక ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ పలు విషయాలు తెలిపారు. రామ్ చరణ్ తో తమన్నా నటన బాగా ఉంటుందని తెలిపారు.

తమన్నా అంటే తనకు చాలా ఇష్టమని, చరణ్ తో ఆమె కెమిస్ట్రీ బావుంటుందంటూ ఉపాసన చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్క్రీన్ మీద వారిద్దరి జోడి అద్భుతంగా ఉంటుంది., స్క్రీన్ పై వారిద్దరిని చూడటం తనకు బాగుంటుందని ఉపాసన చేసిన ఈ వ్యాఖ్యలు మెగా అభిమానులను ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

ఇక రామ్ చరణ్ తమన్నా కాంబినేషన్లో రచ్చ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఇక రామ్ చరణ్ ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే ఈయన శంకర్ దర్శకత్వంలో నటించిన గేమ్ ఛేంజర్ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 10వ తేదీలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ బుచ్చిబాబు డైరెక్షన్లో మరో పాన్ ఇండియా సినిమాకు కమిట్ అయ్యారు. అలాగే సుకుమార్ డైరెక్షన్లో కూడా ఈయన తన కొత్త సినిమాని ప్రకటించిన విషయం తెలిసిందే.

Share This Article