Bigg Boss 8 : బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 8 కార్యక్రమం 8 వారాలను పూర్తిచేసుకుని తొమ్మిదవ వారం కూడా పూర్తి కానుంది. ఈ కార్యక్రమం మొదట్లో 14 మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి అడుగుపెట్టారు. అనంతరం వైల్డ్ కార్డు ద్వారా మరో 8 మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి అడుగుపెట్టారు. ఇలా వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి వెళ్ళిన వారందరూ కూడా మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్లు కావటం విశేషం.
ఇలా మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగు పెట్టిన వారిలో మెహబూబా హౌస్ నుంచి బయటకు వచ్చేసారు. ఇక ఈవారం హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్ళనున్నారు అనేది తెలియాల్సి ఉంది. ఇకపోతే ప్రతి సీజన్లో కూడా తప్పనిసరిగా హౌస్ లోకి ఫ్యామిలీ మెంబర్స్ ఎంట్రీ ఇస్తుంటారనే సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సీజన్లో కూడా ఈ వీకెండ్ తమ ఫ్యామిలీ మెంబర్స్ హౌస్ లోకి రాబోతున్నారని తెలుస్తోంది.
Also Read : Bigg Boss 8 : బిగ్ బాస్ వైల్డ్ కార్డు ఎంట్రీ.. ముక్కు అవినాష్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Is Hero Shivaji Entering the Bigg Boss 8 House?
ఈ క్రమంలోనే మాజీ బిగ్ బాస్(Bigg Boss 8) కంటెస్టెంట్ సినీ నటుడు శివాజీ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది. అయితే ఈయన కంటెస్టెంట్ గా కాకుండా బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్ గా కొనసాగుతున్న నయని పావని కోసమే ఈయన హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నారని సమాచారం. నయని పావని గత సీజన్లో కంటెస్టెంట్ గా పాల్గొన్నారు. గత సీజన్లో కూడా ఈమె వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టా. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటివారమే ఈమె ఎలిమినేట్ కావడంతో తిరిగి సీజన్ 8 లో ఈమెకు మరో అవకాశం లభించింది.
ఇక గత సీజన్లో ఈమె హౌస్ లో ఉన్నది వన్ వీక్ అయినప్పటికీ నటుడు శివాజీతో చాలా మంచి బాండింగ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే పలు సందర్భాలలో ఆయన తనకు మంచి గైడెన్స్ ఇచ్చారని తండ్రిలాగా చాలా మంచి విషయాలు చెప్పారు అంటూ నయని పావని కూడా శివాజీ పట్ల ఎంతో అభిమానం చూపారు.
ఈ క్రమంలోనే శివాజీ నయని పావని కోసం బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళబోతున్నారని తెలుస్తోంది. ఇక శివాజీ గత సీజన్లో కంటెంట్ గా పాల్గొని సందడి చేశారు ఈయన హౌస్ లోకి వెళ్లడంతో ఈయనే విన్నర్ అని అందరూ ఫిక్స్ అయ్యారు. కానీ ఊహించని విధంగా పల్లవి ప్రశాంత్ భారీ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకొని విజేతగా నిలవగా శివాజీ మాత్రం టాప్ త్రీ కంటెస్టెంట్ గా హౌస్ నుంచి బయటకు వచ్చేసారు. బిగ్ బాస్ కార్యక్రమం తర్వాత శివాజీ కెరియర్ పరంగా ప్రస్తుతం ఎంతో బిజీగా ఉన్నారు.