Ayaan : అల్లు అర్జున్ కు ఇచ్చిన అయాన్.. ఫేవరెట్ హీరో బన్నీ కాదా?

2 Min Read

Ayaan : సాధారణంగా పిల్లలకు తమ తల్లిదండ్రులే రోల్ మోడల్ గా ఉంటారు. ఇలా ఎంతోమంది తమ తల్లిదండ్రులు కొనసాగే వృత్తిలోనే స్థిరపడుతూ ఉంటారు. ఇక సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో వారసత్వం కొనసాగుతూనే ఉంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి సినీ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీలలో అల్లు ఫ్యామిలీ ఒకటి. ఈ కుటుంబం నుంచి అల్లు అర్జున్ హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో నటించిన పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ క్రేజ్ భారీగా పెరిగిపోయిందని చెప్పాలి. ఇక త్వరలోనే ఈయన పుష్ప 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.

Also Read : Allu Arjun: అల్లు అర్జున్ తో కచ్చితంగా సినిమా ఉంటుంది.. ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే న్యూస్ చెప్పిన కొరటాల

అల్లు అర్జున్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో మనకు తెలిసిందే. ఈయన కోసం అభిమానులు చొక్కాలు చింపుకుంటారు.  తమ హీరో గురించి చెడుగా మాట్లాడితే గొడవలకు కూడా సిద్ధమవుతూ ఉంటారు. ఆ రేంజ్ లో అల్లు అర్జున్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అయితే తన కొడుకుకి మాత్రం తన తండ్రి ఫేవరెట్ హీరో కాదంటూ ఇటీవల అయాన్ అల్లు అర్జున్ కు గట్టి షాక్ ఇచ్చారు.

బాలకృష్ణ హోస్టుగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమానికి అల్లు అర్జున్ కూడా హాజరు కాబోతున్నారట. ఇప్పటికే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి అయిందని తెలుస్తోంది. ఇక ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ తో పాటు తన కుమారుడు అయాన్(Ayaan) కూడా వచ్చినట్టు తెలుస్తుంది.

అయితే బాలయ్య తనని ప్రశ్నిస్తూ నీ ఫేవరెట్ హీరో ఎవరు అని అడిగారట దానికి అయాన్ సమాధానం చెబుతూ తన తండ్రి పేరు కాకుండా మరో టాలీవుడ్ హీరో అయినటువంటి ప్రభాస్ తన ఫేవరెట్ హీరో అంటూ షాకింగ్ న్యూస్ బయట పెట్టినట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ కు డైహార్ట్ ఫాన్స్ ఉన్నారు. కానీ తన కుమారుడు మాత్రం తన తండ్రి తనకు ఫేవరెట్ హీరో కాదని ప్రభాస్ ఫేవరెట్ హీరో అని చెప్పడంతో ప్రభాస్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Share This Article