Bahubali : టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన చిత్రాలలో బాహుబలి సినిమా ఒకటి. ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకోవడమే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో కూడా తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చింది. ఈ సినిమాని నిర్మాత శోభు యార్లగడ్డ అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.
ఇక ఈ సినిమా మొదటి భాగమే కాకుండా రెండో భాగం కూడా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడంతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయారు. తాజాగా నిర్మాత శోభు యార్లగడ్డ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా శోబోయార్లగడ్డ ఎందుకు బాహుబలి (Bahubali)సినిమాని రెండు భాగాలుగా తీయాల్సి వచ్చింది.. ఈ సినిమాకు మొదట వచ్చిన నెగిటివ్ టాక్ గురించి కూడా కొన్ని విషయాలు వెల్లడించారు.
Also Read : రాజమౌళి డైరెక్షన్లో పవన్ మిస్ చేసుకున్న సూపర్ హిట్ సినిమా ఏంటో తెలుసా?
Negative Talk Surrounds Bahubali’s Release: Shobu Yarlagadda’s
బాహుబలి సినిమా చేయాలనుకున్నప్పుడు దానిని రెండు భాగాల్లో తెరకెక్కించాలని అనుకున్నాము. అప్పట్లో రెండు భాగాలు అంటే చాలా అరుదుగా వచ్చేవి మొదటి భాగం విడుదలైన రెండు మూడు నెలల వ్యవధిలోనే రెండవ భాగం విడుదల చేయాలని భావించాము. అలా అయితేనే మొదటి భాగం ఎవరు మర్చిపోరని అనుకున్నాం. అందుకే రెండు భాగాలు ఒకేసారి షూటింగ్ పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యాము. కానీ బడ్జెట్ భారీగా పెరిగిపోవడంతో అది సాధ్యం కాదని మొదటి భాగం షూటింగ్ పూర్తి చేసి విడుదల చేసాము.
ఈ సినిమా విడుదలైన తర్వాత మొదటి రోజు భారీ నెగిటివ్ టాక్ వచ్చింది. సినిమా బాగాలేదని, పోయిందని చాలామంది మాట్లాడారు. ఆరోజు బయటకు నేను ధైర్యంగా కనిపిస్తున్న లోపల మాత్రం చాలా వణికి పోయాను. నిజంగానే ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వస్తే పరిస్థితి ఏంటి ? తదుపరి పార్ట్ ఎలా తీయాలని ఎన్నో ఆలోచనలు నాలో కలిగాయి. కానీ రెండో రోజుకు ఈ సినిమా టాక్ పూర్తిగా మారిపోయిందని అదృష్టవశాత్తు ఈ సినిమా చాలా మంచి సక్సెస్ అందుకుందని శోభు యార్లగడ్డ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.