Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం హనీ బన్నీ అనే వెబ్ సిరీస్ ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ వెబ్ సిరీస్ నవంబర్ 7వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక ఈ ప్రమోషన్స్ లో భాగంగా సమంత తన కెరియర్ గురించి అలాగే తన వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో విషయాలను బయటపెడుతున్నారు.
ముఖ్యంగా సమంత(Samantha) నాగచైతన్య నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత ఎంతో మనోవేదనకు గురైనట్లు ఈ ఇంటర్వ్యూలలో తెలియజేశారు. మా వైవాహిక జీవితంలో కనుక నేను స్పై గా ఉండి ఉంటే ఈ రోజు నా జీవితం ఇలా ఉండేది కాదు అంటూ పరోక్షంగా తన విడాకుల గురించి కూడా ఈమె ఎమోషనల్ కామెంట్స్ చేశారు.
Also Read : Samantha: సమంత పై మంత్రికి సంచలన వ్యాఖ్యలు.. ఏకమైన టాలీవుడ్!
Samantha’s Shocking Comments on Remarriage
నాగచైతన్య సమంత ఎంతగానో ప్రేమించుకుని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరు చాలా సంతోషంగా ఉన్నారు కానీ కొన్ని కారణాల వల్ల సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోయారు. ప్రస్తుతం నాగచైతన్య మరొక నటి శోభితను రెండో పెళ్లి చేసుకుంటున్నారు. ఇలా శోభిత కారణంగానే సమంత నాగచైతన్య విడిపోయారు అంటూ వీరిద్దరి నిశ్చితార్థం తర్వాత మరో రూమర్ బయటకు వచ్చింది.
ఏది ఏమైనా సమంత నాగచైతన్య విడిపోవడం నాగచైతన్య శోభితను పెళ్లి చేసుకోవడం సమంత అభిమానులకు ఏమాత్రం నచ్చలేదని చెప్పాలి. ఇక నాగచైతన్య తన కెరియర్లో బిజీగా ఉండడమే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా మరో అడుగు ముందుకు వేస్తున్నారు. నాగచైతన్య రెండో పెళ్లి చేసుకుంటున్నారు కనుక సమంత కూడా రెండో పెళ్లి చేసుకుంటుందా అనే సందేహం ప్రతి ఒక్కరిలోనే ఉంది.
తాజాగా ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈమె తన రెండో పెళ్లి గురించి కూడా కీలక విషయాలు వెల్లడించారు. తాను ఎంతో ఇష్టపడి ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను. కొన్ని కారణాల వల్ల ప్రస్తుతం మేము విడిపోయాము. నా జీవితంలో రెండో పెళ్లికి చోటు లేదని, మరో వ్యక్తి నా జీవితంలోకి ఎవరు రారు అంటూ రెండో పెళ్లి గురించి ఈమె కుండబద్దలు కొట్టినట్టు తెలిపారు. సమంత రెండో పెళ్లి గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో వీరి విడాకుల విషయంలో నాగచైతన్యదే తప్పు అంటూ అభిమానులు కామెంట్లు చేస్తూ సమంత పై ప్రశంసలు కురిపిస్తున్నారు.