Samantha: చైతన్య విషయంలో నేను చేసిన పెద్ద తప్పు అదే.. సమంత కామెంట్స్ వైరల్!

2 Min Read

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం చిన్న విరామం తర్వాత వరుస ప్రాజెక్టులకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు. ఇక ఈమె నటించిన సిటాడేల్ వెబ్ సిరీస్ నవంబర్ 7 వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సీరీస్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా సమంత చేసిన కామెంట్స్ పరోక్షంగా తన నిజ జీవితంలో జరిగిన సంఘటనలను ఉద్దేశించి చేశారని తెలుస్తుంది.

ఈ వెబ్ సిరీస్ లో మీరు స్పై ఏజెంట్ గా నటించారు కదా. నిజ జీవితంలో కూడా అలా నటించారా? అనే ప్రశ్న సమంతకు ఎదురయింది. ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూ..నిజ జీవితంలో కూడా నేను స్పైగా వ్యవహరించాల్సింది. అలా చేయకుండా తప్పు చేశాను, దాని వల్లే నా జీవితం ఇలా తయారైంది అంటూ చేసిన కామెంట్స్ పరోక్షంగా తన జీవితానికి సంబంధించి చేశారని తెలుస్తోంది.

Also Read :Samantha: సమంత పై మంత్రికి సంచలన వ్యాఖ్యలు.. ఏకమైన టాలీవుడ్!

samantha comments about chaitanya

నిజ జీవితంలో కూడా నేను రహస్యంగా నాగచైతన్య శోభిత రిలేషన్ పై కన్నేసి ఉంటే ఇప్పుడు తన జీవితం ఇలా అయ్యి ఉండేది కాదని ఈమె పరోక్షంగా తనకు జరిగిన అన్యాయం గురించి తెలిపారని తెలుస్తోంది. నాగచైతన్య సమంత(Samantha)
ప్రేమించుకొని పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ పెళ్లి తర్వాత చాలా అన్యోన్యంగా ఉన్నారు. నాగచైతన్య అంటే సమంతకు చాలా ప్రాణం చైతన్య కూడా సమంతని అలాగే ప్రేమించేవారు.

ఇక వీరిద్దరి జీవితంలోకి శోభిత రావడం వల్ల భేదాభిప్రాయాలు వచ్చాయని వీరిద్దరూ రిలేషన్ లో ఉండటంవల్లే నాగచైతన్య సమంతకు విడాకులు ఇచ్చారని తెలుస్తోంది. అలా కాకుండా నా జీవితంలో కూడా నేను ఒక స్పై ఏజెంట్ గా ఉండి ఉంటే ప్రస్తుతం తన పరిస్థితి ఇలా ఉండేది కాదంటూ సమంత చెప్పకనే చెప్పేశారు. ఇక సమంతకు విడాకులు ఇచ్చిన నాగ చైతన్య తిరిగి శోభితతో పెళ్లికి సిద్ధమయ్యారు. ఈ ఏడాది చివరిలోనే వీరి పెళ్లి ఉండబోతుందని తెలుస్తోంది. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన పనులు కూడా ప్రారంభం అయ్యాయి.

Share This Article