Anchor shyamala : ఏపీ డిప్యూటీ సీఎంను ఏకీపారేసిన యాంకర్ శ్యామల?

2 Min Read

Anchor shyamala : టాలీవుడ్ యాంకర్ వైకాపా అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల తాజాగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఇలా ప్రెస్ మీట్ నిర్వహించిన ఈమె ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచిన పిఠాపురం నియోజకవర్గంలో 16 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగితే పవన్ కళ్యాణ్ ఎందుకు ఆ కుటుంబాన్ని పరామర్శించలేదని ప్రశ్నించారు.బాధిత కుటుంబాన్ని పరామర్శించే బాధ్యత మన డిప్యూటీ సీఎంకి లేదా.. దళిత కుటుంబానికి చెందిన అమ్మాయి అని చిన్నచూపు చూస్తున్నారా అంటూ కూటమి ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించారు.

Also Read : Pawan Kalyan: రోడ్డుపై పవన్ ను అలా చూసి కడుపు తరుక్కుపోయింది: అంజనాదేవి

ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కల్యాణ్ 30 వేల మంది అమ్మాయిలు మిస్ అయ్యారని జగన్‌పై ఆరోపణలు చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమ్మాయిలపై లెక్కలేనన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదు.

జగన్ గారి ప్రభుత్వంలో జరిగిన చిన్న చిన్న తప్పులను కూడా భూతద్దంలో చూపించిన నాయకులు ఇప్పుడు ఎందుకు నోరు మెదపడం లేదని శ్యామల(Anchor shyamala) ప్రశ్నించారు.. ఈ రాష్ట్రంలో బాలికలపైన, ఆడపిల్లలపైన మహిళలపైన హత్యలు, అత్యాచారాలు జరుగుతుండడం దురదృష్టకరమని , ఇవన్నీ కూడా చంద్రబాబు ప్రభుత్వం చేతకానితనం వల్లే జరుగుతున్నాయని శ్యామల ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలేజీలకు వెళ్లే అమ్మాయిలను కూడా బలవంతంగా లాక్కెళ్ళి అత్యాచారం చేసి నిప్పు పెట్టి కాల్చేస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఇలాంటి ఘటనలను చూస్తే అసలు రాష్ట్రంలో ప్రభుత్వం పాలన సాగుతుందా లేదా అన్న అనుమానం కలుగుతుందని శ్యామల వ్యాఖ్యానించారు. చిన్నపిల్లలు పెద్దవారు అత్తా కోడలు అని వరస లేకుండా మతిస్థిమితం లేని వారిని కూడా వదలడం లేదని రాష్ట్ర చరిత్రలోనే ఈ నాలుగు నెలల లో జరిగినన్ని అఘాయిత్యాలు ఎప్పుడు జరగలేదంటూ ఈమె కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Share This Article