Nayanthara : ఆ సినిమా నా జీవితాన్ని మలుపు తిప్పింది.. భర్త పై నయన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్!

2 Min Read

Nayanthara : సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో సీనియర్ నటి నయనతార ఒకరు.ఈమె మలయాళ అమ్మాయి అయినప్పటికీ తెలుగు తమిళ భాషా చిత్రాలలో హీరోయిన్గా నటిస్తూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ అందరి సరసన నటించిన నయనతార ప్రస్తుతం సినిమాలను కాస్త తగ్గించి తన వ్యక్తిగత జీవితంలో సంతోషంగా గడుపుతున్నారు.

నయనతార(Nayanthara) హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలో పలువురు హీరోలతో ప్రేమలో పడటం కొన్ని భేదాభిప్రాయాలు కారణంగా బ్రేకప్ చెప్పుకోవడం జరిగింది. ఇలా బ్రేకప్ తర్వాత తిరిగి డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో ప్రేమలో పడిన నయనతార తనతో కొంతకాలం పాటు సహజీవనం చేసి గత మూడు సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు. ఇక ఈ దంపతులు సరోగసి ద్వారా ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.

Also Read : Nayanthara : 50 సెకండ్లకు ఐదు కోట్ల రెమ్యూనరేషన్.. ఈమె చాలా కాస్ట్లీ గురూ?

nayanatara

ప్రస్తుతం నయనతార తన భర్త పిల్లలతో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. ప్రస్తుతం నయనతార సినిమాలను కాస్త తగ్గించిన సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటారు. తాజాగా తన భర్త గురించి అలాగే తన జీవితాన్ని మలుపు తిప్పిన ఓ విషయం గురించి ఈమె వెల్లడించారు.

మొదటిసారి తనకు డైరెక్టర్ విగ్నేష్ తో నేను రౌడీనే అనే సినిమా ద్వారా పరిచయం ఏర్పడింది. ఈ సినిమా విడుదలై సరిగా తొమ్మిది సంవత్సరాలు కావడంతో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఫోటోలను వీడియో రూపంలో అభిమానులతో పంచుకున్నారు. ఇక ఈ వీడియోని షేర్ చేస్తూ ఈమె..ఈ సినిమా నా జీవితాన్ని మార్చేసింది. నా కెరీర్‌ను గొప్పగా మలుపు తిప్పిన సినిమా నేను రౌడినే. 9ఏళ్ల కిత్రం విడుదలై మర్చిపోలేని అనుభూతులను మిగిల్చి ఉంది ఈ సినిమాని విజయం చేసిన ప్రేక్షకులకు ఎప్పటికీ రుణపడి ఉంటాను.

ఇలాంటి ఒక గొప్ప సినిమాలో నాకు అవకాశం కల్పించిన విగ్నేష్ శివన్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ సినిమా నుంచి నటిగా నేను కొత్త అనుభవాలను నేర్చుకున్నాను. ఈ సినిమా నాకు విఘ్నేష్ ను ఇచ్చింది అంటూ ఈమె చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. ఇక ఈ సినిమాకు దర్శకుడిగా విగ్నేష్ పనిచేశారు ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించడం ఆ ప్రేమ పెళ్లి వరకు దారి తీయడం మనకు తెలిసిన విషయమే.

Share This Article