Ananya Nagalla: మాకు కొంచెం మర్యాద ఇవ్వండి… ట్రోల్స్ పై అనన్య కామెంట్స్!

2 Min Read

Ananya Nagalla : సినీనటి అనన్య నాగళ్ల ప్రస్తుతం పొట్టేల్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈమె నటించిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను కూడా ఘనంగా నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమానికి స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డివంగా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఇలా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఈ కార్యక్రమానికి హాజరయ్యారంటే ఈ సినిమాకు భారీ స్థాయిలో హైప్ ఏర్పడింది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా నటి అనన్య మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మా సినిమాకి సందీప్ రెడ్డి గారు ముఖ్యఅతిథిగా రావడం అంటే చాలా ఆనందంగా ఉందని తెలిపారు.

Also Read : Ananya : పడుకుంటే ఒక రేటు లేదంటే మరో రేటు.. క్యాస్టింగ్ కౌచ్ పై పవన్ బ్యూటీ హాట్ కామెంట్స్?

Ananya nagalla

ఆయన ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు అంటే మా సినిమా స్థాయి ఎంతో పెరిగిందని ఇలాంటి ఒక గొప్ప సినిమాలో మేము భాగం కావడం నిజంగా సంతోషంగా ఉందని ఈమె తెలిపారు. ఇప్పటివరకు ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా సినిమా చాలా అద్భుతంగా ఉందని తెలియజేశారు. ప్రతి ఒక్కరికి తప్పకుండా పొట్టేల్ సినిమా నచ్చుతుందని అనన్య తెలిపారు.

ఇక ఈ కార్యక్రమం చివరిలో ఈమె మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్ల పై భారీ స్థాయిలో ట్రోల్స్ వస్తుంటాయి ఇటీవల ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా ఒక లేడీ రిపోర్టర్ ఈమెను ప్రశ్నిస్తూ ఇండస్ట్రీలో పడుకుంటే ఒక రేటు లేదంటే మరో రేటు అంటూ కమిట్మెంట్స్ గురించి గుచ్చి గుచ్చి ప్రశ్నలు వేశారు.

ఇలా లేడీ రిపోర్టర్ అడిగిన ప్రశ్నలకు అనన్య నాగళ్ళ(Ananya Nagalla) సైతం తనదైన శైలిలోనే సమాధానం చెప్పారు. అయితే లేడీ రిపోర్టర్ అడిగిన ప్రశ్నల పై ఈమె బాగా హర్ట్ అయ్యారని తెలుస్తుంది. ఈ సందర్భంగా అనన్య మాట్లాడుతూ ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ మేకప్ వేసుకుంటారని, ఎప్పుడు నవ్వుతూ ఉంటారని మమ్మల్ని చులకనగా చూడొద్దు మాకంటూ ఒక ఫ్యామిలీ ఉంటుంది మాకు ఆత్మ అభిమానం, మనసు ఉంటుంది. దయచేసి మాకు కూడా కాస్త రెస్పెక్ట్ ఇవ్వండి అంటూ వేదికపై ఈమె చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Share This Article