Sobhita : నాగచైతన్య శోభిత పెళ్లి పనులు ప్రారంభం… పసుపు దంచుతున్న శోభిత!

2 Min Read

Sobhita : సినీ నటుడు నాగచైతన్య శోభిత వివాహానికి సమయం ఆసన్నమైంది. వీరిద్దరూ ఆగస్టు నెలలో నిశ్చితార్థం జరుపుకున్న సంగతి తెలిసిందే .ఈ ఏడాది చివరన లేదా వచ్చేయేడాది మొదట్లో వీరి వివాహం జరగబోతుందంటూ ఇదివరకు వార్తలు వచ్చాయి. కానీ ఎక్కడ పెళ్లికి సంబంధించి అఫీషియల్ డేట్స్ అనౌన్స్ చేయలేదు. ఇక నాగచైతన్య కూడా తన పెళ్లి ఎలా జరిగిన చాలా సాంప్రదాయబద్ధంగా జరుగుతుందని తను అనుకునే వారందరూ తన పెళ్లిలో ఉండాలని ఓ సందర్భంలో వెల్లడించారు.

ఇక వీరి వివాహం వచ్చే ఏడాదే ఉంటుందని అందరూ భావించారు కానీ ఈ ఏడాది చివరిలోనే వీరు వివాహం చేసుకోబోతున్నారని తెలుస్తోంది. నాగచైతన్య సమంత ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. అయితే కొన్ని మనస్పర్ధలు కారణంగా వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు. ఇలా విడాకులు తీసుకున్న అనంతరం నాగచైతన్య శోభిత(Sobhita) ప్రేమలో పడ్డారు. ఇక వీరి విషయం పెద్దలకు తెలియజేస్తూ పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోబోతున్నారు.

Also Read : Sobhita: నేనేలా కోరుకున్నానో అలానే జరిగింది.. చైతన్యతో నిశ్చితార్థం పై శోభిత కామెంట్స్!

Sobhita and naga chaitanya weeding updates

అందుతున్న సమాచారం ప్రకారం వీరి వివాహం డిసెంబర్ 4వ తేదీ జరగబోతుందని తెలుస్తోంది. కానీ పెళ్లి తేదీ గురించి ఎలాంటి అధికారిక సమాచారం మాత్రం లేదు. ఇకపోతే తాజాగా శోభిత ఇంట పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయని తెలుస్తుంది. శోభిత వైజాగ్ లోని తన ఇంటిలో ఎంతో సాంప్రదాయంగా పసుపు దంచే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంతో సింపుల్ గా పట్టుచీరలో అచ్చ తెలుగు అమ్మాయిల శోభిత ఈ పసుపు దంచే కార్యక్రమంలో తన కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు.

ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సమంత నాగచైతన్యల పెళ్లి పనులు ప్రారంభమయ్యాయని తెలిసిన అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా పెళ్లి ఎప్పుడు అంటూ కూడా కామెంట్లో చేస్తున్నారు. మరి వీరి వివాహం ఇండియాలోనే జరుగునుందా లేకపోతే డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశారా అనేది తెలియాల్సి ఉంది. ఇక నాగచైతన్య ప్రస్తుతం చందు మొండేటి డైరెక్షన్లో తండేల్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఓ మత్స్యకారుడి నిజ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Share This Article