Samantha: అలా మాట్లాడాలంటే చాలా భయం.. అందుకే మాట్లాడను

2 Min Read

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన తాజా వెబ్ సిరీస్ సిటాడెల్: హనీ బన్నీ అనే వెబ్ సిరీస్ నవంబర్ ఏడో తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కాబోతోంది. ఈ సిరీస్ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో భారీ స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవల నటీనటులతో పాటు సిరీస్‌ దర్శకులు రాజ్‌ అండ్‌ డీకే ఓ ఆంగ్ల మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఈ సిరీస్‌లో కథానాయికగా మొదట సమంతను అనుకోలేదంటూ డైరెక్టర్ వెల్లడించారు. ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ షూటింగ్ సమయంలో ఈ సిరీస్ ఇంకా స్క్రిప్ట్ దశలో మాత్రమే ఉంది. అందుకే అప్పుడు సమంత వద్ద మేము ఈ సిరీస్ గురించి ప్రస్తావనకు తీసుకురాలేదు. స్క్రిప్ట్ మొత్తం పూర్తి అయిన తర్వాత ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభించాము. ముందుగా హీరోగా నటుడు వరుణ్ ధావన్ ను ఫైనల్ చేశాము.

Also Read : Sai Dharam Tej: నా మామయ్యల విజయమే నాకు సంతోషం.. మెగా మేనల్లుడి కామెంట్స్ వైరల్!

Samantha

ఇక హీరోయిన్ గురించి ఆలోచిస్తూ ఎవరిని తీసుకోవాలి అనే ఆలోచనలో పడ్డాము. హీరో వరుణ్ హిందీ చాలా అద్భుతంగా మాట్లాడుతారు కనుక హీరోయిన్ కూడా హిందీ వచ్చే అమ్మాయి అయితే బాగుంటుందని అనుకున్నాము. ది ఫ్యామిలీ మెన్ 2 సిరీస్ సమయంలో సమంత(Samantha) ఎక్కడ హిందీ మాట్లాడలేదు. అందుకే ఆమెను కాకుండా మరొకరిని తీసుకోవాలనుకున్నాం. అయితే ఒక రోజు సమంత హిందీలో మాట్లాడడం చూసి ఆశ్చర్యపోయాం.

ఎంతో స్పష్టంగా సమంత హిందీ మాట్లాడటం చూస్తున్న మేము అప్పుడే ఈ సిరీస్ లో సమంత హీరోయిన్ గా ఫిక్స్ అయ్యామని తెలిపారు. ఇలా డైరెక్టర్ చేసిన వ్యాఖ్యలపై సమంత స్పందిస్తూ హనీకు (సమంత పాత్రకు) హిందీ బాగా వచ్చు కాకపోతే ఏదైనా వేదికలపై మాట్లాడాలంటే ఏదైనా లోపాలుంటాయేమోనన్న భయంతో నేను వేదిక పై మాట్లాడనని ఈ సందర్భంగా సమంత వెల్లడించారు. ఇక హీరో వరుణ్ ధావన్ కూడా ఈ విషయం గురించి మాట్లాడుతూ డైరెక్టర్స్ ఈ సిరీస్ కథ చెప్పగానే నాకు మైండ్ లోకి వచ్చిన మొదటి హీరోయిన్ సమంతనే అని తెలిపారు. సమంత మాత్రమే ఈ ప్రాజెక్టుకు పూర్తిగా న్యాయం చేయగలరు. ఆమె ఈ ప్రాజెక్టులో భాగమైతే మరింత సక్సెస్ అవుతుందని అనుకున్నట్లు ఈయన తెలిపారు.

Share This Article