Aishwarya-Dhanush : విడాకుల విషయంలో ట్విస్ట్ ఇచ్చిన ఐశ్వర్య ధనుష్?

2 Min Read

Aishwarya-Dhanush : సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రెటీలు ఎంత తొందరగా అయితే ప్రేమలో పడతారో అంతే తొందరగా విడాకులు కూడా తీసుకొని విడిపోతూ ఉంటారు. చాలామంది సెలబ్రిటీలు తమ ప్రేమకు బ్రేకప్ చెప్పుకోగా పలువురు పెళ్లయిన తర్వాత తమ వైవాహిక జీవితానికి బ్రేకప్ చెప్పుకుంటున్నారు. ఇలా పెళ్లి తర్వాత విడిపోయినటువంటి వారిలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఐశ్వర్య జంట ఒకటని చెప్పాలి.

కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న ధనుష్ పెళ్లి కాకముందు పెద్దగా గుర్తింపు పొందలేకపోయారు. కానీ ఈయన రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజినీకాంత్ తో ప్రేమలో పడ్డారు. ఇలా కొంతకాలం పాటు ప్రేమలో ఉన్న వీరిద్దరూ పెద్దల అంగీకారంతో 2004వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు. ఇలా పెళ్లి తర్వాత నటనపరంగా ధనుష్ ఎంతో మంచి సక్సెస్ అందుకోవడమే కాకుండా దర్శకుడిగా నిర్మాతగా కూడా గుర్తింపు పొందారు.

Also Read : Samantha: సమంత పై మంత్రికి సంచలన వ్యాఖ్యలు.. ఏకమైన టాలీవుడ్!

Aishwarya-Dhanush

ఇలా ఇండస్ట్రీలో ధనుష్ ఎదుగుదలకు ఐశ్వర్య కారణమని చెప్పడంలో ఎలాంటి సందేహాలు వ్యక్తం చేయాల్సిన పనిలేదు. ధనుష్ కెరియర్ కు ఐశ్వర్య (Aishwarya-Dhanush)ఎంతో సపోర్టుగా నిలిచారని చెప్పాలి. ఇక పెళ్లి తర్వాత 18 సంవత్సరాల పాటు వీరి వైవాహిక జీవితం ఎంతో సంతోషంగా సాగిపోయింది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. ఇలా పెళ్లి జరిగే 18 సంవత్సరాలకు ఇద్దరి మధ్య వచ్చిన భేదాభిప్రాయాలు కారణంగా 2022వ సంవత్సరంలో విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించారు.

ఇలా ఇన్నేళ్ల వైవాహిక జీవితం తర్వాత విడాకులు తీసుకోబోతున్నారనే విషయం తెలిసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇక వీరిద్దరిని కలపడం కోసం ఇరువురి కుటుంబ సభ్యులకు కూడా ఎంతో ప్రయత్నాలు చేసిన వీరు మాత్రం తమ విడాకుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు. తాజాగా వీరి విడాకుల విషయంలో షాకింగ్ న్యూస్ బయటపడింది.

వీరిద్దరు విడాకుల కోసం చెన్నై కోర్టులో అప్లై చేశారు. అయితే అక్టోబర్ ఆరవ తేదీ విచారణ ఉండటం ఈ విచారణ కోసం ధనుష్ కానీ ఐశ్వర్య కానీ హాజరు కాలేదు దీంతో ఈ విచారణ అక్టోబర్ 19వ తేదీకి వాయిదా వేశారు. ఇలా అక్టోబర్ 19వ తేదీ కూడా వీరిద్దరూ విచారణకు హాజరు కాలేదు దీంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బహుశా వీరిద్దరూ తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని భావిస్తున్నారని అందుకే విచారణకు కూడా హాజరు కాలేదంటూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఐశ్వర్య రజనీకాంత్ సైతం తన తండ్రి ఆరోగ్యాన్ని, ప్రస్తుత కుటుంబ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని తన నిర్ణయాన్ని మార్చుకున్నారని తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవని చెప్పాలి.

Share This Article