Allu Arjun: అల్లు అర్జున్ 100 కోట్ల కొత్త ఇల్లు… ఫస్ట్ గెస్ట్ గా ఆ స్టార్ హీరోని పిలవనున్నారా?

2 Min Read

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా షూటింగ్ ఆలస్యం కావడంతో విడుదల కూడా వాయిదా పడింది. ఇక ఈ సినిమా డిసెంబర్ 6వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు కూడా ఏర్పడుతున్నాయి.

ఇక త్వరలోనే అల్లు అర్జున్ (Allu Arjun)ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో కూడా బిజీ కానున్నారు. ఇదిలా ఉండగా అల్లు అర్జున్ కొత్త ఇంటి నిర్మాణం చేపట్టిన విషయం మనకు తెలిసిందే.త్వరలోనే ఈ ఇంటికి గృహప్రవేశం కూడా చేయబోతున్నారు సుమారు రెండు ఎకరాల విస్తీర్ణంలో జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఈయన అత్యంత ఖరీదైన విలాసవంతమైన ఇంటిని నిర్మించారు. సుమారు 100 కోట్ల ఖర్చుతో ఈ ఇంటిని తన అభిరుచికి అనుగుణంగా నిర్మించారని తెలుస్తుంది.

Also Read : అల్లు అర్జున్ తో (Allu Arjun) కచ్చితంగా సినిమా ఉంటుంది.. ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే న్యూస్ చెప్పిన కొరటాల

Allu Arjun

ఇక ఈ ఇంటి సమీపంలోనే అల్లు అర్జున్ ఆఫీస్ కూడా ఉండటంతో ఈయనకు సినిమాల పరంగా ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని భావించి ఇక్కడ ఇంటి నిర్మాణం చేపట్టారు. అతి త్వరలోనే ఈ ఇంట్లోకి అల్లు అర్జున్ దంపతులు అడుగుపెట్టబోతున్నారు. ఇలా 100 కోట్లతో తన అభిరుచికి అనుగుణంగా ఇంటి నిర్మాణం చేపట్టినప్పటికీ అల్లు అర్జున్ కు ఈ ఇంటి విషయంలో ఒక లోటు ఉండి పోయిందట. మరి ఆ లోటు ఏంటి అనే విషయానికి వస్తే..

తన ఇంటి నిర్మాణం పూర్తి అయిన తర్వాత ఆ ఇంట్లోకి మొదటి గెస్ట్ గా ఒక స్టార్ హీరోని ఆహ్వానించాలని అల్లు అర్జున్ అనుకున్నారట. ఆ మొదటి గెస్ట్ చిరంజీవి అనుకుంటే మనం పొరపాటు పడినట్లే. ఈయన నివాసం ఉంటున్న ఆ ఇంటి నుంచి రెండు ఇళ్ల దూరంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇల్లు కూడా ఉంది. అయితే గతంలో కృష్ణంరాజు గారిని కలిసిన ఈయన మీరు మా ఇంటికి రావాలి అని ఆహ్వానించారట. అయితే ఆ ఇల్లు నిర్మాణ దశలోనే కృష్ణంరాజు గారు మరణించారు.

ఇక కృష్ణంరాజు గారి మరణం తర్వాత స్వయంగా అల్లు అర్జున్ ఈ విషయాన్ని బయటపెట్టారు. నా ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత నేను ముందుగా కృష్ణంరాజు గారిని తన ఇంటికి ఆహ్వానించి ఆయనతో కలిసి లంచ్ చేయాలని కలలు కన్నాను. ఆ కోరిక తీరకుండానే కృష్ణంరాజు గారు మరణించారు అంటూ అల్లు అర్జున్ తన మనసులో ఉన్న కోరికను బయటపెట్టారు. ఇక కృష్ణంరాజు గారు మరణించడంతో ఆ లోటు అలాగే ఉండిపోయిందని తెలుస్తుంది.

Share This Article