Prabhas : ఆ చిన్న సినిమాకు సపోర్ట్ చేసిన ప్రభాస్.. సంతోషంలో అభిమానులు!

2 Min Read

Prabhas : పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న ఈయన బాహుబలి సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోగా పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలలో బిజీగా గడుపుతున్న ప్రభాస్ అప్పుడప్పుడు చిన్న సినిమాలకు తనవంతు మద్దతు తెలుపుతూ ఎంతో హెల్ప్ చేస్తూ ఉంటారు.

ఇలా ప్రభాస్(Prabhas) ఎంతోమంది చిన్న హీరోలకు చిన్న సినిమాలకు మద్దతుగా నిలిచి సినిమా విజయంలో తన వంతు సహాయం చేశారు. తాజాగా ఈయన మరో చిన్న సినిమా అయినా లవ్ రెడ్డి అనే సినిమాకు మద్దతుగా నిలిచారు. ఈ సినిమా విడుదల అయ్యి టాక్ పరంగా మంచి సక్సెస్ అందుకున్నప్పటికీ ప్రేక్షకుల మాత్రం థియేటర్లకు రాకపోవడంతో మేకర్స్ ఏకంగా ఫెయిల్యూర్ మీట్ నిర్వహించారు.

Also Read : Prabhas : జనమంతా ఇన్ స్టాలో ప్రభాస్ ను ఫాలో అవుతుంటే.. కానీ ఆయన ఫాలో అయ్యేది మాత్రం ఈ 23 మందినే..!

prabhas

ఇక ఈ విషయం ప్రభాస్ దృష్టికి వెళ్ళింది. ఒక సీనియర్ టెక్నీషియన్ ఈ సినిమా గురించి ప్రభాస్ వద్ద మాట్లాడుతూ ఈ సినిమాకు మంచి టాక్ ఉంది కానీ ప్రేక్షకులు మాత్రం థియేటర్ కి రావడం లేదు అంటూ ప్రభాస్ వద్ద చెప్పగా ప్రభాస్ ఈ సినిమా గురించి ఇంస్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేస్తూ మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా ప్రభాస్ పోస్ట్ చేస్తూ..లవ్ రెడ్డి గురించి చాలా మంచి విషయాలు వింటున్నా. టీమ్ మొత్తానికి కంగ్రాచులేషన్స్ అని ప్రభాస్ పోస్ట్ చేశారు. ఈ మూవీ ట్రైలర్ లింక్ కూడా జతచేశారు.

ఈ విధంగా ప్రభాస్ ఈ సినిమా గురించి పోస్ట్ చేయడంతో ఈ సినిమాకు కలెక్షన్స్ ఎంత మేర పెరుగుతాయనేది తెలియాల్సి ఉంది. ఇలా ఈ సినిమాకు ప్రభాస్ మద్దతు తెలపడంతో ఆయన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.సినిమా టీమ్‍లో తనకు పరిచయం ఉన్న వారు ఎవరూ లేకపోయినా సాయం చేయాలనే ఉద్దేశంతో సపోర్ట్ చేయడం గొప్ప విషయం అంటూ ప్రభాస్‍ను ప్రశంసిస్తున్నారు.

లవ్ రెడ్డి సినిమాకు మూవీ టీమ్ బ్లాక్‍బస్టర్ బట్ ఫెయిల్యూర్ మీట్ ను నిర్వహించి అందరిని ఆశ్చర్యపరిచారు. ఇక ఈ కార్యక్రమంలో నిర్మాత మదన గోపాల్ రెడ్డి మాట్లాడుతూ… మా సినిమాకు ప్రీమియర్ల ద్వారా మంచి పాజిటివ్ టాక్ వచ్చిన జనాలు మాత్రం థియేటర్లకు రావడం లేదు ఇలా ఈవెంట్ ద్వారా అయినా మా సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువెళ్లడం కోసమే ఈ చిన్న ప్రయత్నం అంటూ ఈయన తెలిపారు.

Share This Article