Mahindra : ఫెస్టివల్ సీజన్ లో స్పెషల్ బాస్ ఎడిషన్ రిలీజ్ చేసిన మహీంద్రా

2 Min Read

Mahindra : మహీంద్రా & మహీంద్రా పండుగ సీజన్ కోసం మహీంద్రా స్కార్పియో క్లాసిక్ ప్రత్యేక బాస్ ఎడిషన్‌ను విడుదల చేసింది. ఇది డీలర్-లేబుల్ అప్‌గ్రేడ్, లుకింగ్ లో కొన్ని మార్పులతో ఈ వెహికల్ తీసుకొచ్చారు. కాకపోతే యాంత్రికంగా మాత్రం ఎలాంటి మార్పులను చేయలేదు. ఈ వేరియంట్ ధరను ఇంకా కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు.

స్కార్పియో క్లాసిక్ బాస్ ఎడిషన్ కొత్త దనం ఏంటి ?
మహీంద్రా స్కార్పియో బాస్ ఎడిషన్ వెలుపలి భాగంలో కొన్ని మార్పులను తీసుకొచ్చింది. ఇందులో ముందు గ్రిల్, ఫాగ్ ల్యాంప్ హౌసింగ్‌పై డార్క్ క్రోమ్ అప్లికేషన్, బానెట్ స్కూప్‌పై డార్క్ క్రోమ్, వెనుక క్వార్టర్ గ్లాస్, హెడ్‌ల్యాంప్‌లు, టెయిల్‌ల్యాంప్‌లను కొత్తగా డిజైన్ చేసింది.

Also Read : Mahindra : పెరిగిన మహీంద్రా XUV 3X0 ధర.. అక్టోబర్ నుంచి అమలు

ఇది రెయిన్ విజర్, ఫ్రంట్ స్కిడ్ ప్లేట్, బ్లాక్ పౌడర్ కోటింగ్‌తో రియర్ గార్డ్, రియర్-వ్యూ కెమెరాను కూడా యాడ్ చేసింది. సైడ్ మిర్రర్ క్యాప్స్‌కి ఫాక్స్ కార్బన్-ఫైబర్ ఫినిషింగ్ ఇవ్వబడింది. లోపలి భాగంలో, బాస్ ఎడిషన్ కుషన్, నెక్ పిల్లోతో కూడిన కంఫర్ట్ కిట్‌తో బ్లాక్ సీట్ అప్హోల్స్టరీని పొందుతుంది.

మహీంద్రా స్కార్పియో క్లాసిక్ పవర్‌ట్రెయిన్
స్కార్పియో క్లాసిక్‌లో 2.2-లీటర్, 4-సిలిండర్ mHawk డీజిల్ ఇంజన్ ఉంది. ఇది 132hp పవర్, 300Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ పవర్ 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ద్వారా వెనుక చక్రాలకు పంపబడుతుంది. ప్రస్తుతం, స్కార్పియో క్లాసిక్‌కి భారతదేశంలో ప్రత్యక్ష ప్రత్యర్థులు లేరు, కానీ బలమైన 7-సీటర్ ఎంపికగా, ఇది హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి మధ్యతరహా SUVలతో పోటీపడుతుంది. ఈ స్పెషల్ ఎడిషన్ లిమిటెడ్-రన్ సేరీస్ గా కస్టమర్లకు అందుబాటులోకి వచ్చింది. మహీంద్రా అధికారిక డీలర్ షిప్స్ వద్ద ఆసక్తి కలిగిన కస్టమర్లు పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

Share This Article