Allu Arjun: ఫ్లాప్ అవుతుందని తెలిసిన బన్నీ ఆ సినిమా చేశారా.. ఎందుకంత సాహసం?

2 Min Read

Allu Arjun : తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా మంచి సక్సెస్ అందుకున్న అల్లు అర్జున్ నేడు పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు పొందారు. అల్లు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ తనకంటూ ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న అల్లు అర్జున్ పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ హీరోగా సక్సెస్ అయ్యారు. ఇక ఈ సినిమాతో బన్నీ కెరియర్ పూర్తిగా మారిపోయిందని చెప్పాలి. త్వరలోనే ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంగా పుష్ప 2 సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇక అల్లు అర్జున్(Allu Arjun) సినిమాలు చూస్తే కనుక చాలా సరదాగా ఉండే పాత్రలలోనే నటిస్తుంటారు అలాగే ఈయన ఏ ఇంటర్వ్యూలో పాల్గొన్న సరదాగా మాట్లాడుతూ అందరిని నవ్విస్తూ ఉంటారు. ఇక ఈయన ఏదైనా ఒక సినిమాకు కమిట్ అయ్యారు అంటే ఆయన కమిట్ అయిన సినిమా ద్వారా ప్రేక్షకులు వినోదాన్ని ఆస్వాదించారా లేదా ఆ సినిమా ద్వారా ఎవరికైనా ప్రయోజనం కలిగిందా అనే విషయాలను మాత్రమే ముందు చూస్తారు.

Also Read : అల్లు అర్జున్ తో (Allu Arjun) కచ్చితంగా సినిమా ఉంటుంది.. ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే న్యూస్ చెప్పిన కొరటాల

సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా మంచి కలెక్షన్స్ రాబడుతుందా అనే విషయాల గురించి ఆలోచించరు. సినిమాల విషయంలో ఇలాంటి ఆలోచన ధోరణి ఉన్నటువంటి అల్లు అర్జున్ ఒక సినిమా ఫ్లాప్ అవుతుందని తెలిసిన కూడా ఆ సినిమాలో నటించారు. అసలు సినిమా ఫ్లాప్ అవుతుందని తెలిసిన బన్నీ ఎందుకు నటించారు.. అసలు ఆ సినిమా ఏంటి అనే విషయానికి వస్తే.. అల్లు అర్జున్ కెరీర్ లోనే డిజాస్టర్ సినిమాగా నిలిచిపోయిన వాటిలో నా పేరు సూర్య నా ఊరు ఇండియా చిత్రం ఒకటి.

ఈ సినిమా కథ డైరెక్టర్ తనకు చెప్పినప్పుడే ఎక్కడో తేడా కొడుతూ ఈ సినిమా పోతుందని బన్నీ గెస్ చేశారట. సినిమా ఫ్లాప్ అయినప్పటికీ కూడా ఇలాంటి సినిమాలలో నటించినప్పుడే మన పేరు కూడా చరిత్రలో నిలిచిపోతుందన్న ఉద్దేశంతోనే ఇలాంటి దేశభక్తి సినిమాలో నటించారు. ఇక ఈయన అనుకున్న విధంగానే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచిన బన్నీ పెద్దగా ఫీల్ అవ్వలేదు. ముందుగానే ఈ సినిమా రిజల్ట్ తెలియడంతో ఆయన ఏమాత్రం బాధపడలేదని తెలుస్తుంది.

Share This Article