Ratan Tata love story : వ్యాపార దిగ్గజం రతన్ టాటా అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఆయన మరణం వ్యాపార సామ్రాజ్యంలో ఓ తీరని లోటు అనే చెప్పుకోవాలి. అయితే లక్షల కోట్లకి అధిపతి అయిన ఆయన తన జీవితంలో వివాహం చేసుకోలేదు. మరి లవ్ ఫెయిల్ అవ్వడంతోనే రతన్ టాటా(Ratan Tata love story) పెళ్లి చేసుకోలేదా? అసలు ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? పెళ్లి పీటలేక్కబోతున్న ఈ జంటను విడదీసింది ఎవరు? రతన్ టాటా లవ్ స్టోరీలో ఫైనల్ గా విలన్ ఎవరు? అనేది ఈ ఆర్టికల్ ద్వారా చూసి తెలుసుకుందాం…
రతన్ టాటా (86).. పరిచయం అక్కర్లేని పేరు. పారిశ్రామిక రంగంలో దిగ్గజ వ్యాపార వేత్తగా పేరు తెచ్చుకున్నారు. ప్రారంభించిన ప్రతి వ్యాపారాన్ని లాభాల బాటలో నడిపించి సక్సెస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారారు. తాను కేవలం పారిశ్రామిక వేత్తగానే కాకుండా.. గొప్ప మానవతావాదిగా కూడా పేరు సంపాదించుకున్నారు. ఆయన జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం. విలువలతో కూడిన వ్యాపారం, నిరంతరం ఉద్యోగుల కోసం ఆలోచించే ఆయనంటే ప్రతీఒక్కరికీ ఎనలేని అభిమానం.
ఇంత గొప్పవ్యక్తి.. చివరివరకూ పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్‌గానే ఉండటం గమనార్హం. ఆయన కన్నుమూసిన వేళ.. నెటిజన్లు ఆయన పర్సనల్ లైఫ్ గురించి, తన కుటుంబం గురించి సెర్చ్ చేస్తున్నారు. అయితే ఆయన జీవితంలో తీరని లోటు ఏదైనా ఉంది అంటే అది ఆయన పెళ్లి మాత్రమే. ఈ క్రమంలో ఆయన ఎందుకు చివరిదాకా బ్యాచిలర్‌గా ఉన్నారనే విషయం తెలియాలంటే.. రతన్ టాటా అమర ప్రేమగాథ(Ratan Tata love story) గురించి ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాల్సిందే.
Ratan Tata Love Story: Why Didn’t He Marry for His Beloved?
మనందరికీ రతన్ టాటా (Ratan Tata love story)అంటే.. ఓ గొప్ప పారిశ్రామిక వేత్తగా.. అంతకంటే గొప్ప మానవతావాదిగా మాత్రమే తెలుసు. కానీ, ఆయనకు కూడా మనసుకు హత్తుకునే లవ్ స్టోరీ ఉందని.. ఆ ప్రేమ పెళ్లి(Ratan Tata love story) పీటల వరకు చేరుకోలేదని.. అందుకు కారణం ఓ యుద్ధమని చాలా మందికి తెలియదు. 1937 డిసెంబర్ 28వతేదీన ముంబైలో పార్సీ జొరాస్ట్రియన్ కుటుంబంలో రతన్ టాటా జన్మించారు. ఆ తర్వాత రతన్ టాటాను నావల్ టాటా దత్తత తీసుకున్నారు. అయితే.. రతన్ టాటాకు పదేళ్లు ఉండగా అంటే.. 1948వ సంవత్సరంలో ఆయన తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత టాటా అమ్మమ్మ నవాజ్‌బాయి టాటాని దత్తత తీసుకుని.. పెంచి పెద్ద చేశారు. తల్లిదండ్రుల విడాకుల ఎఫెక్ట్ రతన్ టాటాపై పడకుండా ఆమె విలువలతో పెంచారు.
రతన్ టాటా(Ratan Tata love story) అమెరికాలో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. తన నాన్నకు ఇష్టం లేకున్నా కూడా ఆర్కిటెక్చర్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు రతన్ టాటా. దీంతో లాస్ ఏంజెల్స్‌లో రతన్ టాటాకు జాబ్ దొరికింది. అక్కడే రెండేళ్లు పనిచేశారు. లాస్ ఏంజెల్స్‌లో జాబ్ చేస్తున్న సమయంలోనే రతన్ టాటా ప్రేమలో పడ్డారు. చాలా గాఢంగా ప్రేమలో మునిగితేలారు. పార్కులు, సినిమాలు, షికార్లు ఇలా.. ప్రేమలోకంలో కొంతకాలం విహరించారు. ఇద్దరూ పెళ్లి కూడా చేసుకుందామని నిర్ణయించుకున్నారు.
సరిగ్గా అదే సమయంలోనే ప్రతి సినిమాలో వచ్చే ట్విస్ట్‌లా రతన్ టాటా లవ్ స్టోరీలో కూడా కీలక మలుపు వచ్చింది. రతన్ టాటాకు ఎంతో ఇష్టమైన అమ్మమ్మకు ఆరోగ్యం క్షీణించిందని కబురందటంతో హుటాహుటిన ఇండియాకు వచ్చేశారు. అయితే ఆ తర్వాత రతన్ టాటా ఇక్కడే చాలా రోజులు ఉండిపోవాల్సి వచ్చింది. తాను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ప్రియురాలు కూడా తనకోసం ఇండియాకు వస్తుందని భావించాడు. అందుకోసం ఎదురుచూశాడు కూడా. కానీ.. అలా జరగలేదు.
ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. రతన్ టాటా లవ్ స్టోరీ నడుస్తున్న టైంలోనే.. భారత్, చైనా మధ్య భీకర యుద్దం కొనసాగుతోంది. ఆ సమయంలోనే రతన్ టాటా అమెరికా నుంచి ఇండియాకు తిరిగి రావడం జరిగింది. అయితే ఈ యుద్ధం రతన్ టాటా ప్రేమకథలో మెయిన్ విలన్‌గా మారింది. యుద్ధం మీద భయంతోనో.. కూతురి మీద ప్రేమతోనో కానీ.. ఆ అమ్మాయిని ఇండియాను పంపేందుకు ఆమె తల్లిదండ్రులు మాత్రం ఎంతకూ అంగీకరించలేదు. దీంతో ఇద్దరి మధ్య ఎడబాటు పెరిగింది. ఫలితంగా.. వారిద్ధరి ప్రేమ.. ప్రేమ దగ్గరే ఆగిపోయింది.. పెళ్లిపీటలెక్కే వరకు చేరుకోలేకపోయింది.
రతన్ టాటా ప్రేమించిన అమ్మాయి.. పెళ్లి చేసుకుందో లేదే తెలియదు కానీ, ప్రియురాలి జ్ఞాపకాలతో రతన్ టాటా మాత్రం చివరి వరకూ పెళ్లి చేసుకోకుండా మిగిలిపోయారు. చిన్న వయసులోనే తల్లిదండ్రుల విడాకులు.. అనంతరం ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి దూరం కావడం.. ఈ సంఘటలు రతన్ టాటా మనుసును మార్చేసాయో.. లేదా ఒకటే బాణం.. ఒకతే సీత.. అన్నట్టుగా తన ప్రేమ కూడా తన ప్రేయసితోనే అనుకున్నాడో.. మొత్తానికి తాను ప్రేమించిన అమ్మాయి దూరం కావటంతో ఇక తన జీవితంలో మళ్లీ ప్రేమకు గానీ, ఇంకో అమ్మాయికి గానీ, రతన్ టాటా చోటివ్వలేదు. తన లైఫ్ జర్నీలో పెళ్లి అనే బంధానికి స్వస్తి చెప్పి బ్యాచిలర్‌గానే మిగిలిపోయారు.
తన లవ్ స్టోరీ గురించి ఎవ్వరికీ తెలియని ఎన్నో విషయాల్ని.. గతంలో ప్రఖ్యాత హ్యుమన్స్ ఆఫ్ బాంబేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా రతన్ టాటానే రివీల్ చేసారు. హ్యుమన్స్ ఆఫ్ బాంబే ఈ విషయాలని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడం జరిగింది. పెళ్లి దాకా వెళ్లి మధ్యలో ఆగిపోయిన రతన్ టాటా అమర ప్రేమకథ హిస్టరీలో నిలిచిపోతుంది. ఐతే రతన్ టాటా లైఫ్‌లో ఒకటే లవ్ జర్నీ కాదు.. మరో మూడు లవ్ ట్రాక్స్ కూడా ఉన్నాయంటూ ఎన్నో వార్తలు చక్కర్లు కొట్టాయి. అందులో అప్పటి ఓ బాలీవుడ్ అందాల తార కూడా ఉందని ప్రచారం జరిగింది. వాళ్లిద్దరి లవ్ జర్నీ కూడా చాలా దూరమే వెళ్లిందని.. కానీ, కొన్ని రీజన్స్ వల్ల పెళ్లి వరకు చేరుకోలేకపోయిందని వార్తలొచ్చాయి. ఈ వార్తలపై అలనాటి తార కూడా ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించిందని వార్తలున్నాయి. కానీ, అందులో ఎంత వరకు నిజం ఉందన్నది మాత్రం క్లారిటీ లేదు.
అయితే గతంలో రతన్ టాటా పెళ్లి గురించి మాట్లాడుతూ.. బిజినెస్ లో సక్సెస్ సాధించిన అనంతరం చాలా సమయాల్లో వివాహం చేసుకోవాలని ఆలోచన వచ్చినా.. వ్యాపార రంగంలో బిజీ కావడంతో.. కుటుంబానికి సమయం కేటాయించలేనేమోనన్న భయం వేసేదని వెల్లడించారు. అందుకే చాలాసార్లు వైవాహిక జీవితంలోకి అడుగుపెడదామని భావించినా కూడా దూరమైనట్లు టాటా నాటి ఇంటర్వ్యూలో వివరించారు. అయితే బిజినెస్ పరంగా ఎంతో సక్సెస్ సాధించిన రతన్ టాటా.. లవ్ కు యుద్ధం అడ్డుగా మారి.. ఫెయిల్యూర్ కి గురి చేసింది. కానీ, గొప్ప మానవతావాదిగా దేశానికి తన అవసరమునప్పుడల్లా ముందడుగు వేసి దేశభక్తిని చాటుకున్న రతన్ టాటా.. ఇకలేరు.. ఇకరారు.