రతన్ టాటా ఇక లేరు.. ప్రధానితో సహా ప్రముఖుల దిగ్భ్రాంతి…..

5 Min Read

Ratan Tata : ముంబైలోని బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో వైద్య చికిత్స తీసుకుంటున్న ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా (86) కన్నుమూసిన విషయం తెలిసిందే. ముంబయిలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం రాత్రి తుది శ్వాస విడిచారు. రక్తపోటు అకస్మాత్తుగా పడిపోవడంతో సోమవారం నుంచి ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్ లో చేరిన ఆయన ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతూ ఈ లోకాన్ని వీడి వెళ్లిపోయారు.

1937 డిసెంబర్ 28వతేదీన నావల్ టాటా – సోనీ టాటా దంపతులకు రతన్ టాటా(Ratan Tata) జన్మించారు. 1991 సంవత్సరంలో రతన్ టాటా టాటా గ్రూప్ చైర్మన్ అయ్యారు. ఆ తర్వాత ఆయన వెనుదిరిగి చూడలేదు. 10 వేల కోట్లుగా ఉన్న టాటా పారిశ్రామిక సామ్రాజ్యాన్ని లక్ష కోట్లకు తీసుకెళ్లడంలో ఆయన కృషి ఎంతో ఉంది. భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన పారిశ్రామికవేత్తలలో రతన్ టాటా ఒకరు. ఆయన నాయకత్వంలో టాటా గ్రూప్ ఎన్నో ముఖ్యమైన విజయాలను సాధించింది. రతన్ టాటాకు 2000వసంవత్సరంలో పద్మభూషణ్, 2008లో పద్మవిభూషణ్, దేశం రెండవ అత్యున్నత పౌరపురస్కారాలు లభించాయి.

Also Read : Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. హరిహర వీరుమల్లు రిలీజ్ డేట్ లాక్!

సమాజానికి ఎంతో సహకారం అందించిన అసాధారణ నాయకుడు – నటరాజన్ చంద్రశేఖరన్

పద్మవిభూషణ్ రతన్ టాటా(Ratan Tata) మరణించారన్న వార్తను టాటా సన్స్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ ధృవీకరిస్తూ ఒక ప్రకటన రిలీజ్ చేశారు. మేము నిజంగా మిస్టర్ రతన్ నావల్ టాటాకి వీడ్కోలు పలుకుతున్నాం. టాటాకు మాత్రమే కాకుండా సమాజానికి అపరిమితమైన సహకారం అందించిన అసాధారణ నాయకుడు అని ఆయన పేర్కొన్నారు. ‘టాటా గ్రూప్‌కి, రతన్ టాటా చైర్‌పర్సన్‌ కంటే ఎక్కువ. నాకు, ఆయన ఒక గురువు, మార్గదర్శకుడు, స్నేహితుడు. ఆయన ఉదాహరణ ద్వారా ప్రేరణ పొందాడు. ఒక తిరుగులేని నిబద్ధతతో శ్రేష్ఠత, సమగ్రత, ఆవిష్కరణలతో, అతని సారథ్యంలో టాటా గ్రూప్ దాని యొక్క విస్తరణకు దారితీసింది. ప్రపంచ పాదముద్ర ఎల్లప్పుడూ దాని నైతిక దిక్సూచికి కట్టుబడి ఉంటుంది అని చంద్రశేఖరన్ చెప్పారు.

పరోపకారం, సమాజ అభివృద్ధికి రతన్ టాటా అంకితభావం లక్షల మంది జీవితాలను తాకింది. విద్య నుంచి ఆరోగ్య సంరక్షణ వరకు, అతని కార్యక్రమాలు లోతుగా పాతుకుపోయాయి. రాబోయే తరాలకు ఉపయోగపడే గుర్తు. ఈ పనులన్నింటిని కూడా బలపరిచేది మిస్టర్ టాటా ప్రతి వ్యక్తి పరస్పర చర్యలో నిజమైన వినయం. మొత్తం టాటా ఫ్యామిలీ తరపున, నేను ఆయన ప్రియమైనవారికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. మేము రతన్ టాటా సూత్రాలను నిలబెట్టెందుకు ప్రయత్నిస్తున్నప్పుడు ఆయన వారసత్వం మనకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. ఉద్రేకంతో విజేతగా నిలిచారంటూ టాటా సన్స్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ పేర్కొన్నారు.

గడియారం ఆగిపోయింది.. టైటాన్ చనిపోయింది – పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా

రతన్ టాటా కన్నుమూశారని పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ‘గడియారం టిక్ చేయడం ఆగిపోయింది. టైటాన్ చనిపోయింది. రతన్ టాటా(Ratan Tata) సమగ్రత, నైతిక నాయకత్వం, దాతృత్వానికి ఒక వెలుగు వెలిగారు. ఆయన వ్యాపార, వెలుపలి ప్రపంచంలో చెరగని ముద్ర వేశారు. ఆయన మన జ్ఞాపకాలలో ఎప్పటికీ ఎదుగుతాడు. ఆర్.ఐ.పి’ అంటూ ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా ఎక్స్ వేదికగా సంతాపం వ్యక్తం చేశారు.

రతన్ టాటా మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి

రతన్ టాటా(Ratan Tata) మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయనను కలిసిన సందర్భాలను గుర్తు చేసుకున్నారు. రతన్ టాటా జీ దూరదృష్టి గల గొప్ప వ్యాపార నాయకుడు, దయగల ఆత్మ, అసాధారణమైన మానవుడు. అతను భారతదేశంలోని పురాతన, అత్యంత ప్రతిష్టాత్మకమైన వ్యాపార సంస్థలకు స్థిరమైన నాయకత్వాన్ని అందించారు. అదే సమయంలో అతని సహకారం బోర్డ్‌రూమ్‌కు మించినది. రతన్ టాటా వినయం, దయ, మన సమాజాన్ని మెరుగుపరచాలనే అచంచలమైన నిబద్ధతకు కృతజ్ఞతలు. చాలా మందికి ఆయన ఆప్తుడయ్యారు’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రధాని మోదీ తాను గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలోనూ రతన్ టాటాను కలిసిన సందర్భాలను గుర్తు చేసుకున్నారు.

రతన్ టాటా మృతి పట్ల తాను తీవ్రంగా బాధపడ్డానంటూ.. రాజ్‌నాథ్ సంతాపం

రతన్ టాటా మృతి పట్ల తాను తీవ్రంగా బాధపడ్డానని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఎక్స్‌లో పేర్కొన్నారు. ఆయన మన ఆర్థిక వ్యవస్థ, వాణిజ్యం, పరిశ్రమలకు తన గణనీయమైన కృషికి ప్రసిద్ధి చెందిన భారతీయ వ్యాపారానికి దృఢంగా ఉన్నారు. ఆయన కుటుంబానికి, స్నేహితులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి కలగాలి అని రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు.

రతన్ టాటా లేకపోవడాన్ని నేను నమ్మలేకపోతున్నా.. ఆనంద్ మహీంద్రా

పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా.. ‘రతన్ టాటా లేకపోవడాన్ని నేను అంగీకరించలేను’ అంటూ ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ చారిత్రాత్మక పురోగతికి చేరువలో ఉంది. మనం ఉన్న చోటికి రతన్ టాటా జీవితం, పని చాలా పెద్దసహకారం అందించింది. అందువల్ల, ఈ సమయంలో ఆయన మార్గదర్శకత్వం మరింత అమూల్యమైనది. ఆయన కన్నుమూసిన తరువాత, మనం చేయగలిగేదల్లా ఆయన చూపిన మార్గాన్ని అనుసరించడమే. ఎందుకంటే ఆయన ఒక వ్యాపారవేత్త, ఆయన కోసం ఆర్థికసంపద, విజయం, ప్రపంచ సమాజానికి సేవ చేసేందుకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. మహోన్నతుడికి వీడ్కోలు. మిమ్మల్ని మరిచిపోలేము. ఎందుకంటే లెజెండ్స్ ఎప్పటికీ మరణించరు…ఓం శాంతి” అంటూ ఆనంద్ మహీంద్రా ఎక్స్ ద్వారా సంతాపం వ్యక్తం చేశారు.

రతన్ టాటా విజన్ ఎంతో స్ఫూర్తిదాయకం.. సుందర్ పిచాయ్

రతన్ టాటా (Ratan Tata)మృతి పట్ల గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భారతీయ సంతతికి చెందిన టెక్ దిగ్గజం గూగుల్‌లో దూరదృష్టి గల వ్యాపార నేతతో తన చివరి సమావేశాన్ని గుర్తు చేసుకున్నారు. “గూగుల్‌లో రతన్ టాటాతో నా లాస్ట్ మీటింగ్.. మేము ఎన్నో అంశాలపై చర్చించాం. ఆయన విజన్ గురించి వినడానికి చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. ఆయన అసాధారణమైన వ్యాపారం, దాతృత్వ వారసత్వాన్ని విడిచిపెట్టారు. భారత్‌లో ఆధునిక వ్యాపార నాయకత్వాన్ని మార్గదర్శకత్వం చేయడంలో కీరోల్ ప్లే చేశారు” అని పిచాయ్ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. ”భారత్‌ను అభివృద్ధిపథంలో నడపడంలో టాటా చాలా శ్రద్ధ వహించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి.. రతన్ జీ.. మీ ఆత్మకు శాంతి చేకూరాలని వేడుకుంటున్నాను” అంటూ పిచాయ్ ఎక్స్ వేదికగా నివాళులు అర్పించారు.

TAGGED:
Share This Article