Rohini Jabardasth బిగ్ బాస్ వైల్డ్ కార్డు ఎంట్రీ కోసం అన్ని పాన్ ఇండియా సినిమాలను వదులుకున్న రోహిణి?బిగ్ బాస్ కార్యక్రమం ప్రస్తుతం 8వ సీజన్ ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. ఎనిమిదవ సీజన్ ఇప్పటికే ఐదు వారాలను పూర్తి చేసుకుంది. 5వ వారంలో 8 మంది మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్లు వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టారు. ఇలా వైల్డ్ కార్డు ద్వారా అడుగుపెట్టిన వారిలో రోహిణి ఒకరు. ఈమె గతంలో సీజన్ 3 కంటెస్టెంట్ గా హౌస్ లో సందడి చేశారు. అప్పుడు కూడా వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టిన ఈమె తనదైన శైలిలోనే టాస్కులు ఆడుతూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.
ఇక బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతున్న రోహిణి హౌస్ లో ఎక్కువగా వెనక చేరి మాట్లాడుతుండడం, గుసగుసలు ఎక్కువ అవ్వడంతో కాస్త నెగటివిటీని సంపాదించింది. దీంతో ఈమె ఏడవ వారంలోనే హౌస్ నుంచి బయటకు రావాల్సి వచ్చింది. ఇలా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈమె కెరియర్ పూర్తిగా మారిపోయిందని చెప్పాలి.వరుసగా సినిమాలు బుల్లితెర కార్యక్రమాలు అంటూ కెరియర్ పరంగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
Did Rohini Give Up Pan-India Movies for a Bigg Boss Wild Card Entry?
ఇక ఇటీవల కాలంలో వరుసగా సినిమా అవకాశాలను అందుకుంటున్న రోహిణికి పాన్ ఇండియా సినిమాలలో నటించే అవకాశాలు కూడా వచ్చాయి. కానీ మరోవైపు తనకు బిగ్ బాస్ వైల్డ్ కార్డు ఎంట్రీ ఛాన్స్ రావడంతో సుమారు 3 పాన్ ఇండియా సినిమాలను సైతం వదులుకొని బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టారని తెలుస్తుంది. ఇక బిగ్ బాస్ వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం కోసం ఈమె భారీ స్థాయిలోనే రెమ్యూనరేషన్ డిమాండ్ చేశారని తెలుస్తుంది.
ప్రస్తుతం వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లో కొనసాగడం కోసం రోహిణి (Rohini)ఏకంగా వారానికి నాలుగు లక్షల రూపాయలు రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినప్పటికీ మేకర్స్ మాత్రం ఈమె అడిగినది మొత్తం ఇవ్వటానికి అగ్రిమెంట్ కుదుర్చుకున్నారని తెలుస్తుంది. ఇలా వారానికి నాలుగు లక్షల రూపాయల రెమ్యూనరేషన్ అంటే మామూలు విషయం కాదు. మరి ఈసారైనా రోహిణి చివరి వరకు ఉంటుందా లేక మధ్యలోనే బయటకు వస్తుందా అనేది తెలియాల్సి ఉంది.