Ntr : ఎన్టీఆర్ గ్యారేజ్.. ఇచట ఫ్లాప్ డైరెక్టర్లకు హిట్ ఇవ్వబడును!

2 Min Read

Ntr : పాన్ ఇండియా స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా దేవర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయి మంచి టాక్ సొంతం చేసుకొని భారీ స్థాయిలో కలెక్షన్స్ కూడా రాబడుతుంది. ఇక ఈ సినిమాకు అనుగుణంగా వరుసగా సెలవులు అలాగే దసరా సెలవులు కూడా తోడు కావడంతో కలెక్షన్లు భారీగా వస్తున్నాయని చెప్పాలి.

ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఎన్టీఆర్ కి సంబంధించి ఎన్నో వార్తలు వైరల్ అవుతున్నాయి. రాజమౌళి సినిమా చేసిన తర్వాత ఏ హీరో అయినా తదుపరి సినిమా ఫ్లాప్ కావాల్సిందే అంటూ ఒక సెంటిమెంట్ ఇండస్ట్రీలో ఉంది. అలాంటి సెంటిమెంట్ క్రియేట్ చేసింది ఎన్టీఆర్ అయితే ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేసింది కూడా ఎన్టీఆర్ అంటూ పలు పోస్టులు సోషల్ మీడియాలో దర్శనం ఇస్తున్నాయి.

Also Read : Ntr: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ స్పెషల్ సాంగ్ కోసం స్టార్ హీరోయిన్…మామూలు ప్లానింగ్ కాదుగా?

ఇకపోతే ఫ్లాప్ డైరెక్టర్లకు హిట్ ఇచ్చే సెంటిమెంట్ ఎన్టీఆర్ విషయంలో కొనసాగుతుందని ఆ సెంటిమెంట్ మరోసారి రిపీట్ అయిందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ గ్యారేజ్ ఇక్కడ ఫ్లాప్ డైరెక్టర్లకు హిట్ ఇవ్వబడును అంటూ పలు మీమ్స్ వైరల్ అవుతున్నాయి.

ఎన్టీఆర్ కొరటాల డైరెక్షన్లో దేవర సినిమా చేశారు అయితే ఈయన ఇదివరకు సినిమా ఆచార్య డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాతో డిజాస్టర్ డైరెక్టర్ గా పేరు పొందిన కొరటాలకు దేవర అవకాశం ఇచ్చి హిట్ అందించారు. అయితే గతంలో కూడా పూరి జగన్నాథ్ కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా ద్వారా ఫ్లాప్ అందుకున్నారు. అనంతరం ఎన్టీఆర్ తనకు టెంపర్ సినిమాతో అవకాశం ఇచ్చి హిట్ అందించారు.

పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ గా పేరు పొందిన సుకుమార్ సైతం మహేష్ బాబు హీరోగా నటించిన నేనొక్కడినే సినిమా ద్వారా ఫ్లాప్ అందుకున్నారు. ఈ సినిమా తర్వాత సుకుమార్ డైరెక్షన్లో ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమా చేసి డైరెక్టర్ కు మంచి హిట్ అందించారు. ఇక డైరెక్టర్ బాబి రవితేజ హీరోగా నటించిన పవర్ సినిమా, పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫ్లాప్ అందుకున్నారు. ఇలాంటి ఒక డిజాస్టర్ డైరెక్టర్ కి ఎన్టీఆర్ జై లవకుశ సినిమా అవకాశం కల్పించారు.ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ తో అజ్ఞాతవాసి సినిమా చేసి డిజాస్టర్ అందుకోవడమే కాకుండా ఎన్నో వివాదాలలో కూడా చిక్కుకున్నారు. ఇలాంటి ఒక డిజాస్టర్ డైరెక్టర్ కి ఎన్టీఆర్ అరవింద సమేత సినిమా అవకాశం కల్పించి సక్సెస్ అందించారు. ఇప్పుడు కొరటాలకు కూడా సక్సెస్ అందించడంతో ఫ్లాప్ డైరెక్టర్ల పాలిట ఎన్టీఆర్ దేవుడు అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Share This Article