Samantha: అతన్ని ఇప్పటికీ చాలా మిస్ అవుతున్నా.. సమంత పోస్ట్ వైరల్… నాగచైతన్య గురించేనా?

2 Min Read

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సినీ జీవితం ఒక తెరిచిన పుస్తకం అని చెప్పాలి. ఆమె ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి ఇండస్ట్రీలో ఎలాంటి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు, అలాగే కెరియర్ పరంగా వ్యక్తిగతంగా ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారనే విషయాలు అందరికీ తెలుసు. ఏం మాయ చేసావే సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైన సమంత మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్నారు.

ఇలా మొదటి సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో ఈమెకు తదుపరి సినిమా అవకాశాలు వచ్చాయి. ఇలా తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అందరి సరసన నటించి ఎంతో పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న సమంతకు (Samantha)ఇతర భాషలలో కూడా అవకాశాలు రావడంతో ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగారు. ఇక ఈమె నటుడు నాగచైతన్య ప్రేమించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.

Also Read : Rakul Preet Singh: దాని కారణంగా జీవితంలో ఎన్నో కోల్పోయాను.. రకుల్ సెన్సేషనల్ కామెంట్స్!

Samantha's viral post reveals she still misses someone deeply. Is it about Naga Chaitanya

ఎంతో సంతోషంగా సాగిపోతున్న వీరి జీవితంలో వచ్చిన భేదాభిప్రాయాలు కారణంగా విడాకులు తీసుకొని విడిపోయారు. ఇలా నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న సమంత ఇప్పటికీ ఒంటరిగానే ఉన్న నాగచైతన్య మాత్రం రెండో పెళ్లికి సిద్ధమయ్యారు. ఇక సమంత మాత్రం కెరియర్ పై ఫోకస్ పెట్టి వరుస సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తున్నారు, త్వరలోనే సమంత నటించిన హనీ బన్నీ అనే వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ వెబ్ సిరీస్ నవంబర్ ఒకటవ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రాబోతున్న నేపథ్యంలో ఇటీవల లండన్ లో ఈ సిరీస్ ప్రీమియర్ షో వేశారు. అయితే ఈ ప్రీమియర్ కి సంబంధించిన కొన్ని ఫోటోలను సమంత సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. సమంత ఈ ఫోటోలను షేర్ చేస్తూ ఈ పోస్టుకు మిస్సింగ్ మై మ్యాన్ వరుణ్ ధావన్ అనే క్యాప్షన్ జత చేసింది సమంత. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ వెబ్ సిరీస్ హాలీవుడ్ సిటాడెల్ వెబ్ సిరీస్ కు రీమేక్ గా హనీ బన్నీ అనే పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ వెబ్ సిరీస్ కు రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు. ఇక ఇందులో సమంతకు జోడిగా బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ నటించారు. అయితే పలు వ్యక్తిగత కారణాలవల్ల వరుణ్ ధావన్ ఈ సిరీస్ ప్రీమియర్ కి రాకపోవడంతో సమంత తనని మిస్ అవుతున్నట్టు సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

Share This Article