Sobhita: నేనేలా కోరుకున్నానో అలానే జరిగింది.. చైతన్యతో నిశ్చితార్థం పై శోభిత కామెంట్స్!

2 Min Read

Sobhita: సినీ నటుడు అక్కినేని నాగచైతన్య రెండో పెళ్లికి సిద్ధమైన సంగతి మనకు తెలిసిందే. ఈయన మొదట సమంతను ప్రేమించి పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం పాటు సంతోషంగా ఉన్న ఈ జంట అనంతరం వారిద్దరి మధ్య వచ్చిన భేదాభిప్రాయాల కారణంగా విడాకులు తీసుకొని విడిపోయారు. ఈ విధంగా సమంత నాగచైతన్య విడిపోయిన మూడు సంవత్సరాలకు నాగచైతన్య రెండో పెళ్లికి సిద్ధమయ్యారు.

ఈ క్రమంలోనే నటి శోభితతో(Sobhita) ప్రేమలో పడిన నాగచైతన్య పెద్దల సమక్షంలో ఆగస్టు 8వ తేదీ సింపుల్గా తన ఇంట్లోనే నిశ్చితార్థం జరుపుకున్నారు. ఇలా వీరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. ఇకపోతే తాజాగా శోభిత తన నిశ్చితార్థం గురించి మాట్లాడుతూ చేసిన కొన్ని కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Also Read : Bigg Boss House Rules : మారిన రూల్…ఇది గమనించారా?

sobhita comments about her engagement

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శోభిత(Sobhita) తన నిశ్చితార్థం గురించి మాట్లాడుతూ నాగచైతన్యతో తన నిశ్చితార్థం ఎలా అయితే జరగాలి అనుకున్నానో అలాగే జరిగిందని తెలిపారు. అది సింపుల్ గా జరిగిందా లేదా ఘనంగా జరిగిందా అన్నది నేను పట్టించుకోను ఆ క్షణం నేను ఎంత సంతోషంగా ఉన్నాను అనేదే నేను ఆలోచిస్తానని శోభిత తెలిపారు.

నేను ఎన్నో కలలు లేదా అంచనాలు, ప్లానింగ్ తో ఆ క్షణం కోసం ఎదురు చూడలేదు. ఆ క్షణాన్ని ఆస్వాదించాను. చాలా సింపుల్ గా, రిలాక్స్‌డ్ గా, స్వీట్ గా జరిగిపోయింది. నేను ఎలా అనుకున్నానో అలాగే జరిగింది. మనకి ఇష్టమైన అందమైన క్షణాలు జరిగినప్పుడు అలంకారమే అవసరం లేదు.ఆ క్షణమే నాకు చాలనిపిస్తుంది. అందుకే అది సింపుల్ గా జరిగిందా లేదా అన్న ఫీలింగ్ నాకు కలగలేదు. ఎలా జరగాలో అలాగే జరిగింది అది ఫర్ఫెక్ట్ అంటూ ఈమె తన నిశ్చితార్థం గురించి పలు విషయాలు తెలిపారు. ఇక పెళ్లి తర్వాత పిల్లల్ని కనీ అమ్మతనాన్ని ఆస్వాదించే విషయం గురించి నేను ఎన్నో కలలు కన్నాను. అలాంటివి జరిగినప్పుడు కచ్చితంగా నేను మన సాంప్రదాయాలను పాటిస్తానని, నా తల్లిదండ్రులు, సాంప్రదాయాలు, నా మూలాలతో నేనెప్పుడూ మమేకమై ఉంటాను అంటూ శోభిత వెల్లడించారు.

Share This Article