Kajal Agarwal తో రొమాన్స్… భయపడిన స్టార్ హీరో.. ఎవరంటే?

2 Min Read

Kajal Agarwal: లక్ష్మీ కళ్యాణం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు హీరోయిన్ గా పరిచయమయ్యారు నటి కాజల్ అగర్వాల్. ఈ సినిమా తర్వాత ఈమె నటించిన చందమామ, మగధీర వంటి సినిమాలు పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా ఈ సినిమాలు మంచి సక్సెస్ కావడంతో తెలుగులో వరుస అవకాశాలు వచ్చాయి. ఇలా తెలుగులో స్టార్ హీరోలు అందరి సరసన ఈమె నటించారు.

కాజల్ అగర్వాల్ యంగ్ హీరోలతో పాటు సీనియర్ హీరోల సరసన కూడా నటించిన సంగతి తెలిసిందే. ఇలా నటిగా మంచి సక్సెస్ అందుకున్న కాజల్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం కోసం అందరి హీరోలు ఆసక్తి చూపారు. కానీ ఒక హీరో మాత్రం కాజల్ అగర్వాల్ తో సినిమా అంటే వెనకడుగు వేశారని తెలుస్తోంది. మరి కాజల్ తో సినిమా అంటే భయపడిన ఆ హీరో ఎవరు అనే విషయానికొస్తే ఆయన మరెవరో కాదు సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి అని చెప్పాలి.

Also Read :https://teluguvaradhi.com/nbk-to-share-screen-with-mokshagna/

Kajal Agarwaland chiranjeevi

చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత నటించిన చిత్రం ఖైదీ నెంబర్ 150 డైరెక్టర్ వివి వినాయక్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. అయితే ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా Kajal Agarwal అనే విషయం డైరెక్టర్ చెప్పడంతో చిరంజీవి మరే హీరోయిన్ నైనా తీసుకోండని చెప్పారట. కాజల్ అగర్వాల్ తన కొడుకుతో మూడు సినిమాలు చేసింది అలాంటిది నేను కూడా తనతో సినిమా చేస్తే ఫాన్స్ ఒప్పుకోరని చిరంజీవి చెప్పారట.

ఇక కాజల్ అగర్వాల్ కేవలం రామ్ చరణ్ తో మాత్రమే కాకుండా అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ వంటి హీరోలతో కూడా నటించారు. తిరిగి నేను కూడా ఆమెతో నటిస్తే బాగుండదని చిరంజీవి వెనకడుగు వేయగా వినాయక్ మాత్రం ఈ సినిమాకు ఈమెనే ఫైనల్ చేశారు. అయితే ఈ సినిమా నుంచి ఒక పోస్టర్ విడుదల చేసిన తర్వాత సురేఖ ఈ పోస్టర్ కి మంచి రివ్యూ ఇచ్చారట. ఇలా సురేఖ రివ్యూ ఇవ్వటంతోనే ఈ సినిమా పాస్ అయిపోయిందని అందుకే తాను కాజల్ అగర్వాల్ తో కలిసి సినిమాలో నటించానని ఒక ఇంటర్వ్యూ సందర్భంగా స్వయంగా చిరంజీవి ఈ విషయాన్ని వెల్లడించారు. ఇక ఈ సినిమా తర్వాత మరోసారి వీరి కాంబినేషన్లో ఆచార్య సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే చివరి క్షణంలో కాజల్ అగర్వాల్ కి సంబంధించిన సీన్లు అన్నింటినీ కూడా తొలగించారు.

Share This Article