Sai Dharam Tej: నా మామయ్యల విజయమే నాకు సంతోషం.. మెగా మేనల్లుడి కామెంట్స్ వైరల్!

2 Min Read

Sai Dharam Tej: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మెగా మేనల్లుడుగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యి తనకంటూ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక సాయి తేజ్ (Sai Dharam Tej) కు తన మామయ్యలు అంటే ఎంతో గౌరవం, ప్రేమ అనే సంగతి మనకు తెలిసిందే. తన మామయ్యలకు సంబంధించి ఏదైనా గుడ్ న్యూస్ వింటే కనుక ముందుగా సాయి తేజ్ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు.

ఇటీవల పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో ఘన విజయం సాధించిన నేపథ్యంలో తన మామయ్యను ఎత్తుకొని చుట్టూ తిప్పేస్తూ తన సంతోషాన్ని తెలియజేశారు. తాజాగా తన పెద్ద మామయ్య చిరంజీవి ఇటీవల గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకోవడంతో మరోసారి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. చిరంజీవి సినిమాలలో వేసిన డాన్స్ కి గాను ఆయనకు ఈ అరుదైన గౌరవం లభించింది.

Sai Dharam Tej About Chiranjeevi , Nagabau , Pawan

Sai Dharam Tej

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు మెగా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. దీంతో సాయి తేజ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక వేదికపై చిరంజీవిని సత్కరిస్తున్న సమయంలో సాయి తేజ్ పెద్ద ఎత్తున విజిల్ వేస్తూ సంతోషం వ్యక్తం చేశారు. గతంలో కూడా పవన్ కళ్యాణ్ గెలిచిన సమయంలో చిరు ఇంట్లో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. అందరూ కలిసి కేక్ కట్ చేస్తున్న సమయంలో సాయి తేజ్ విజిల్ వేస్తూ సందడి చేశారు.

తాజాగా ఈ రెండు వీడియోలను కలిపి ఈయన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన మామయ్యల విజయమే నాకు సంతోషం అంటూ క్యాప్షన్ ఇచ్చారు. అనంతరం చిరంజీవికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కడంతో ఈయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ డాన్స్ అంటే చిరంజీవి గారు చిరంజీవి గారు అంటేనే డాన్స్.

Also Read : https://teluguvaradhi.com/annavaram-movie-interesting-fact-balayya-first/

నాకు ఊహ తెలిసిన తర్వాత హీరో అంటే ఆయనే డాన్స్ అంటే ఆయన వేసే స్టెప్పులే. ఆ నాట్యానికి ఇవాళ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కడం నిజంగా సంతోషకరమైన విషయం అంటూ ఈయన తన సంతోషాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడంతో మరోసారి మెగా అభిమానులు ఈయనకు తన మామయ్యల పట్ల ఉన్నటువంటి ప్రేమ గౌరవం చూసి ఫిదా అవుతున్నారు.

Share This Article