Ola, TVS, Bajaj : ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో ఓలా, టీవీఎస్‌ల ఆధిపత్యం పెరుగుతోంది. ఈ విభాగంలో రెండు కంపెనీలు మొదటి, రెండవ స్థానాలను కలిగి ఉన్నాయి. ఈ రెండు స్కూటర్లు కూడా వేర్వేరు వేరియంట్లలో వస్తున్నాయి. ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలో ప్రధాన భాగం దాని బ్యాటరీ, మోటారు. బ్యాటరీ ధర వాహనం మొత్తం ధరలో సగం లేదా అంతకంటే ఎక్కువ ఉంటుంది. ఒక వేళ మీరు గనుకు ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేసినట్లైతే.. ఈ స్కూటర్ల బ్యాటరీల ధరను కూడా తెలుసుకోవాలి. బ్యాటరీలలో ఏదైనా లోపం ఉంటే, లేదా వాటి వారంటీ గడువు పూర్తయితే వాటిని మార్చుకునేందుకు భారీ మొత్తంలో ఖర్చు చేయవలసి ఉంటుంది.
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ ధర
గతేడాది ఓలా స్కూటర్ బ్యాటరీ ధరల వివరాలను సోషల్ మీడియా వినియోగదారు షేర్ చేశారు. అతను షేర్ చేసిన ఫోటోలో S1 , S1 ప్రో ధరలు కూడా పేర్కొన్నారు. దాని ప్రకారం.. Ola S1 ఎలక్ట్రిక్ స్కూటర్లో ఉపయోగించే 2.98 kWh బ్యాటరీ ప్యాక్ ధర రూ.66,549. Ola S1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్లో ఉపయోగించిన 3.97 kWh బ్యాటరీ ప్యాక్ రేటు రూ. 87,298. ఇప్పుడు కూడా ఈ బ్యాటరీల ధర దాదాపు 60 నుంచి 70 వేల రూపాయలు.
Also Read : Ola, Bajaj, TVS, Ather ఇవే కాదు..212కిమీ నడిచే ఈ అద్భుతమైన స్కూటర్ గురించి తెలుసా ?
Ola, TVS, Bajaj Electric Scooters: Battery Replacement Costs Revealed!
TVS iQube స్కూటర్ బ్యాటరీ ధర
TVS iQube iQube, iQube , iQube ST 3 విభిన్న వేరియంట్లలో మార్కెట్లో ఉంది. దాని టాప్ మోడల్లో కంపెనీ 3.4 kWh సామర్థ్యం గల నాన్-రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్‌ను అందించింది. ఇది ఫుల్ ఛార్జింగ్ పై 145కిమీల రేంజ్ ఇస్తుంది. అయితే, కంపెనీ ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో అనేక అప్ డేట్లను చేసింది. అలాగే, ఇప్పుడు ఇందులో చాలా చౌకైన వేరియంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ స్కూటర్ బ్యాటరీ ప్యాక్‌ను మార్చడానికి అయ్యే ఖర్చు రూ.56,000 నుండి రూ.70,000 వరకు ఉంటుంది. కంపెనీ బ్యాటరీపై 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్ల వారంటీని కూడా ఇస్తుంది.
బజాజ్ చేతక్ స్కూటర్ బ్యాటరీ ధర
ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకంలో కూడా బజాజ్ చేతక్ ఆధిపత్యం కనిపిస్తుంది. ఈ స్కూటర్ 3 kW బ్యాటరీ ప్యాక్‌ని పొందుతుంది. కంపెనీ ఇటీవలి కాలంలో విభిన్న బ్యాటరీ బ్యాక్‌లతో తన వేరియంట్లను కూడా విడుదల చేసింది. ఇతర కంపెనీల మాదిరిగానే, బజాజ్ కూడా తన ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీపై 3 సంవత్సరాల వారంటీని ఇస్తుంది. అయితే, బ్యాటరీ పాడైపోయినా, లేదా బ్యాటరీ వారంటీ గడువు ముగిసినా రూ. 50,000 వెచ్చించాల్సి ఉంటుంది.